ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్ కంప్లీట్ చేసేసి ఆదిపురుష్ అలాగే మరో పాన్ ఇండియా మూవీ సలార్ షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఆదిపురుష్ కోసం ముంబై, సలార్ కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీకి ప్రభాస్ అప్ అండ్ డౌన్ చేస్తున్నాడు. తాజాగా ఆదిపురుష్ షూట్ నుండి ప్రభాస్ బ్రేక్ తీసుకుని సలార్ షూట్ కోసం హైదరాబాద్ కి వచ్ఛినట్టుగా తెలుస్తుంది. రామోజీ ఫిలిం సిటీలో సలార్ కొత్త షెడ్యూల్ ప్రారంభం అవగా.. ప్రభాస్ కూడా ఆ షెడ్యూల్ లో పాల్గొంటున్నట్లుగా తెలుస్తుంది. కన్నడ సంచలనం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మాస్ కటౌట్ తో తెరకెక్కుతున్న సలార్ మూవీ యాక్షన్ సీన్స్ ని రామోజీ ఫిలిం సిటీలో తెరకెక్కిస్తున్నారట.
ఈ షెడ్యూల్ లో ప్రభాస్ చమట్లు చిందిస్తూ 50 మంది విలన్స్ తో ఫైట్ చేస్తాడని, ఈ ఒక్క యాక్షన్ సీన్ కోసమే ఓ పది రోజుల పాటు చిత్రీకరించాలని, అంటే దాదాపుగా సెప్టెంబర్ 20 వరకు ప్రభాస్ రామోజీ ఫిలిం సిటీలో ఉంటారని అంటున్నారు. ఈ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకే హైలెట్ అనేలా ఉంటుంది అని, ఈమూవీలోనే ఎంతో హైలైట్‌గా నిలవబోయే ఇంటర్వెల్ బ్లాక్‌కు సంబంధించిన ఎపిసోడ్ గా చెబుతున్నారు. మరి ఈ యాక్షన్ ఎపిసోడ్ ఏ రేంజ్‌లో ఉండబోతుందో ఊహించుకుంటే ప్రభాస్ ఫాన్స్ కి రోమాలు నిక్కబొడవాల్సిందే అంటున్నారు. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. జగపతి బాబు కీలక పాత్రలో గూస్ బంబ్స్ తెప్పించే లుక్ లో కనిపించబోతున్నారు.