బిగ్ బాస్ సీజన్ 5 లో గ్లామర్ మిస్ అయ్యింది, గ్లామర్ మిస్ అయ్యింది అని బుల్లితెర ప్రేక్షకులు తెగ ఫీలైపోతున్నారు. గత సీజన్ లో మోనాల్ గజ్జర్ అందాలకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. కానీ ఈ సీజన్ లో అంతగా గ్లామర్ తో ఆకట్టుకునే లేడీ కంటెస్టెంట్స్ ఒక్కరూ లేరు. ఇక బిగ్ బాస్ హౌస్ లో ఏడుపులు, గొడవలు, ముదురు లేడీస్ మధ్యన ఫైటింగ్ అబ్బో హౌస్ మొత్తం చిందర వందరగా ఉంది. అయితే ఇప్పటికే బిగ్ బాస్ లోకి ఒకేసారి అంటే ఓపెనింగ్ డే రోజునే 19 మంది రికార్డు స్థాయిలో అడుగుపెట్టారు.
ఇక ఇప్పుడు బిగ్ బాస్ కూడా బుల్లితెర ప్రేక్షకుల బాధలని అర్ధం చేసుకుని ఓ గ్లామర్ గర్ల్ ని వైల్డ్ కార్డు ఎంట్రీ ఇప్పించబోతుందట. ఇప్పటికే యాంకర్ వర్షిణి బిగ్ బాస్ సీజన్ 5 కి వెళుతుంది. అందాలకు కొదవ ఉండదు అనుకుంటే.. వర్షిణి బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు వర్షిణి వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్ సీజన్ 5 కీ ఎంట్రీ ఇవ్వబోతుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో రేజ్ అయ్యింది. మరి సోషల్ మీడియాలో బిగ్ బాస్ లీకులు నిజమైనట్టుగా వర్షిణి నిజంగానే బిగ్ బాస్ కి వెళ్లబోతుందేమో చూడాలి.