Advertisement
Google Ads BL

సాయి తేజ్ పై రూమర్స్ క్రియేట్ చెయ్యొద్దు


సాయి ధరమ్ తేజ్.. గత రాత్రి స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయ్యి ఆక్సిడెంట్ అవడంతో అపోలో హాస్పిటల్ లో చికిత్సపొందుతున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉంది అని అపోలో వైద్యులు ప్రకటించారు. అయినప్పయిటీకి మెగా ఫ్యామిలీ చిరు ఆయన భార్య, చరణ్ ఆయన భార్య ఉపాసన, పవన్ కళ్యాణ్, వరుణ్, వైష్ణవ్, నిహారిక ఇలా అందరూ అపోలో హాస్పిటల్ లోనే ఉన్నారు. రాత్రి నుండే సినీ ప్రముఖులు సాయి తేజ్ ని పరామర్శిస్తున్నారు. తాజాగా మంచు ఫ్యామిలీ విష్ణు, ఆయన భార్య వెరోనికా, లక్ష్మి మంచు అపోలో హాస్పిటల్ కి వెళ్లి సాయి తేజ్ ని పరామర్శించారు. ఇక రాజకీయ, సినిమా ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా సాయి తేజ్ కోలుకోవాలి అంటూ ట్వీట్ చేస్తున్నారు. 

Advertisement
CJ Advs

అయితే సాయి తేజ్ స్పోర్ట్స్ రేస్ లో బైక్ అదుపుతప్పి కింద పడిపోయాడని, సాయి తేజ్ బైక్ రేసింగ్ పై మీడియాలో కథనాలు ప్రసారం అవుతున్నాయి. దానితో పోలీస్ లు కూడా సాయి తేజ్ బైక్ రేసింగ్ పై ఫోకస్ పెట్టినట్లుగా వార్తలు రావడంతో మంచు లక్ష్మి స్పందిస్తూ.. సాయి తేజ్ తనకి తెలిసి చాలా మంచివాడు, బాధ్యత కలిగిన వ్యక్తి. సాయి తేజ్.. రూల్స్ ఎప్పుడు బ్రేక్ చెయ్యడు. కేవలం రోడ్డుపై ఉన్న మట్టి వల్లే సాయి కి  ఈ ప్రమాదం జరిగింది. కాబట్టి దయచేసి ఇలాంటి వదంతులు వ్యాప్తి చేయకండి. ఇప్పుడు సాయి తేజ్ క్షేమంగానే ఉన్నాడు. అతను త్వరితగతిన కోలుకోవాలని అందరూ దేవుడ్ని ప్రార్థిద్దాం అంటూ సాయి ధరమ్ తెజ్ పై వస్తున్న రూమర్స్ కి మంచు లక్ష్మి చెక్ పెట్టే ప్రయత్నం చేసింది. 

Manchu Lakshmi Comments on Sai Dharam Tej Accident:

Manchu Lakshmi visits Apollo Hospitals
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs