శివ నిర్వాణ దర్శకత్వంలో నాని - ఆది పినిశెట్టి, నివేత థామస్ కాంబినేషన్ లో నిన్ను కోరి లాంటి క్యూట్ లవ్ స్టోరీ వచ్చింది. ఆ తర్వాత నాగ చైతన్య - సమంత - అన్షు కలయికలో మజిలీ లాంటి లవ్ అండ్ ఫ్యామిలీ స్టోరీతో సినిమా వచ్చింది. రెండు సినిమాలు హిట్. దానితో నాని మరోసారి టక్ జగదీశ్ అంటూ శివ నిర్వాణతో జత కట్టాడు. వారి కలయికలో వచ్చిన టక్ జగదీశ్ వినాయక చవితి ఫెస్టివల్ సందర్భంగా ఓటిటి నుండి అంటే అమెజాన్ ప్రైమ్ నుండి రిలీజ్ అయ్యింది. టక్ జగదీశ్ కుటుంబ కథ చిత్రంగా అన్ని వర్గాల ప్రేక్షకులని ఆకట్టుకుంది అనే అనిపిస్తుంది. క్రిటిక్స్ పాజిటివ్ రివ్యూస్ తో నాని - శివ హిట్ కొట్టేసినట్లే. కాకపోతే కలెక్షన్స్ లెక్కలు రావు కాబట్టి అది ఏమాదిరి హిట్ అయ్యిందో చెప్పలేం.
మరి ఈ సినిమా తర్వాత విజయ్ దేవరకొండ తో శివ ఓ సినిమా చెయ్యాల్సి ఉంది. టక్ జగదీశ్ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో సినిమా ఉంటుంది అని చెప్పాడు. మరి టక్ జగదీశ్ చూసాక విజయ్ కనీసం ఆ సినిమాపై ఎలాంటి ట్వీట్ వెయ్యలేదు. అందులోను శివ నిర్వాణ చెప్పిన లవ్ స్టోరీ లైన్ విజయ్ కి నచ్చలేదని చెప్పుకుంటున్నారు. టక్ జగదీశ్ చేసాక విజయ్ స్పందన ఏమన్నా ఉంటే.. వారి కలయికలో సినిమాపై అందరిలో హోప్స్ ఉండేవి. కానీ ఇప్పుడు డౌటే అంటున్నారు. విజయ్ ఆల్రెడీ పాన్ ఇండియా స్టయిల్ కి వెళ్ళిపోయాడు. ఇక శివ తో ఇక్కడి సినిమా చేస్తాడా.. అనే డౌట్ అందరిలో ఎప్పటినుండో ఉంది.