Advertisement
Google Ads BL

సాయి తేజ్ బైక్ రేసింగ్ పై అనుమానాలు


సినిమా ఇండస్ట్రీలోనే కాదు.. పొలిటికల్ లీడర్స్ కొడుకులు, సామాన్యమైన కుర్రాళ్ళు బైక్ రైడింగ్స్ అంటూ రేసింగ్స్ కి వెళ్లి స్పోర్ట్స్ బైక్స్ పై యాక్సిడెంట్ కి గురయ్యి చనిపోయినవారు చాలామందే ఉన్నారు. నటులు బాబు మోహన్, కోట శ్రీనివాసరావు కొడుకులు ఇలాంటి స్పోర్ట్స్ బైక్స్ పై రేసింగ్స్ కి వెళ్లి మరణించారు. అయితే తాజాగా సాయి ధరమ్ తేజ్ నిన్న రాత్రి స్పోర్ట్స్ బైక్ ప్రమాదంలో అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. సాయి తేజ్ స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అవడంతో రోడ్డు మీద పడిపోవడంతో గాయాలపాలై ఆసుపత్రి పాలయ్యాడు. దానితో మెగా ఫ్యామి లి మొత్తం అపోలో హాస్పిటల్ లోనే ఉంది. పవన్, చిరు అంతా ఆసుపత్రిలోనే ఉండి ఆయన ఆరోగ్యంపై డాక్టర్స్ తో మాట్లాడుతున్నారు. 

Advertisement
CJ Advs

అయితే నటుడు నరేష్ తన కొడుకు నవీన్, సాయి తేజ్ లు బైక్ రేసర్స్ అని, వారిని రేసింగ్స్ కి వెళ్లోద్దని, మితి మీరిన వేగంతో బైక్స్ నడపొద్దని సాయి తేజ్ కి చాలాసార్లు చెప్పాను అని, గత రాత్రి కూడా సాయి తేజ్ తన ఇంటి నుండి వెళ్లాడని ఓ వీడియో ని వదలడంతో.. ఇప్పుడు సాయి ధరమ్ తేజ్ బైక్ రేసింగ్ పై పోలీస్ లు దృష్టి పెట్టారు. ఇప్పటికే మితి మీరిన వేగం, నిర్లక్ష్యపు డ్రైవింగ్ పై సాయి తేజ్ పై పోలీస్ కేసు కూడా పెట్టారు. ఈ బైక్ రేసింగ్స్ పై పోలీస్ లు స్పెషల్ డ్రైవ్స్ నిర్వహించినా .. యూత్ వినడం లేదు. క్రికెటర్ అజారుద్దీన్ కొడుకు కూడా బైక్ రేసింగ్ లోనే కన్ను మూసాడు. ఇప్పుడు సాయి తేజ్ బైక్ రేసింగ్ పై నరేష్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. 

ఇక సాయి తేజ్ కోలుకుంటున్నాడని, ఆయన పరిస్థితి నిలకడగా ఉంది అని, త్వరలోనే సాయి తేజ్ పూర్తిగా కోలుకుంటాడడని అపోలో హాస్పిటల్ డాక్టర్స్ చెబుతున్నారు. 

Bike race with son is reason for Sai Dharam Tej road:

Bike race with son is reason for Sai Dharam Tej
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs