రాజమౌళి - రామ్ చరణ్ - రామ రావు కాంబోలో భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిన ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీ గా వుంది. అయితే సినిమాని ఎట్టి పరిస్తితుల్లో వరల్డ్ వైడ్ గా అక్టోబర్ 13 నే రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా రాజమౌళితో పాటు ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ ఆగష్టు ఫస్ట్ వీక్ వరకు ప్రకటిస్తూ వచ్చారు. కానీ ఆ తర్వాత రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ పై వెనక్కి తగ్గడంతో సినిమా అక్టోబర్ 13 న రావడం లేదని అందరూ ఫిక్స్ అయ్యారు. కానీ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ మాత్రం ఇంతవరకు స్పందించలేదు.
అయితే తాజాగా ఆర్.ఆర్.ఆర్ నుండి అఫీషియల్ ప్రకటన వచ్చింది. వరల్డ్ వైడ్ గా థియేటర్స్ అన్ని ఇంకా పూర్తి సామర్థ్యంతో పని చెయ్యని కారణముగా అక్టోబర్ 13 న ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయలేకపోతున్నామని.. త్వరలోనే ఆర్.ఆర్.ఆర్ న్యూ రిలీజ్ డేట్ ఇస్తామంటూ ప్రకటించారు. దానితో ఆర్.ఆర్.ఆర్ దసరా బరి నుండి అఫీషియల్ గా తప్పుకుంది. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అవ్వొచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. మరి ఆర్.ఆర్.ఆర్ న్యూ రిలీజ్ డేట్ కోసం మరోసారి ఫాన్స్ వెయిట్ చెయ్యాల్సి వచ్చేలా కనిపిస్తుంది.