Advertisement
Google Ads BL

సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్


మెగాస్టార్ మేనల్లుడు, హీరో సాయిధరమ్‌ తేజ్‌ కి గత రాత్రి రోడ్ యాక్సిడెంట్ అవగా, ఆయనకి అపోలో లో ట్రీట్మెంట్ జరుగుతుంది. రోడ్ మీద బైక్ స్కిడ్ అవడంతో కిందపడిపోయిన సాయి ధరమ్ షాక్ తో స్పృహ తప్పినట్లుగా వైద్యులు చెబుతున్నారు. అపోలో లో సాయి ధరమ్ కి ఐసియులో చికిత్స అందిస్తున్నారు. గత అర్ధరాత్రి సాయి ధరమ్ తేజ్ హెల్త్ బులిటిన్ విడుదల చేసారు. ఇక సాయి ధరమ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని.. అభిమానులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మెగాస్టార్‌ చిరంజీవి చెప్పారు. 

Advertisement
CJ Advs

మెగా ఫాన్స్ అభిమానులు సోషల్‌మీడియా వేదికగా వరుస ట్వీట్లు పెడుతున్నారు. ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలంటూ ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు సోషల్‌మీడియా వేదికగా పలువురు సినీ ప్రముఖులు సాయి తేజ్‌ గురించి ట్వీట్లు పెడుతున్నారు. బ్రదర్‌ సాయిధరమ్‌తేజ్‌.. త్వరగా కోలుకోవాలి అని ఎన్టీఆర్‌ ట్వీట్ చేసారు. ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, అల్లు అరవింద్‌, త్రివిక్రమ్‌, నిహారిక, వరుణ్‌ తేజ్‌, వైష్ణవ్‌ తేజ్‌తోపాటు సందీప్‌ కిషన్‌ సైతం హుటాహుటిన ఆస్పత్రికి చేరుకున్నారు. 

ప్రస్తుతం అపోలో హాస్పిటల్ వైద్యులు సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. సిటీ స్కాన్ చేశామని, ఇంటెర్నెల్ ఇంజ్యూరిస్ అవలేదని, ఈ రోజు మరికొన్ని టెస్ట్ లు చేస్తామని, సాయి ధరమ్ కోలుకుంటున్నారని, ఆరోగ్యం నిలకడగా ఉంది అని, ఐసియులో చికిత్స అందిస్తున్నామని, మద్యాన్నం లోగా ఆయన మాట్లాడతారని అపోలో డాక్టర్స్ తెలిపారు. ఇక రామ్ చరణ్ ఆయన భార్య ఉపాసనతో కలిసి సాయి ధరమ్ ని పరామర్శించడానికి అపోలోకి వచ్చారు.

Sai Dharam Tej Second Health Bulletin:

Mega Hero Sai Dharam Tej Health Bulletin
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs