Advertisement
Google Ads BL

సాయి ధరమ్ హెల్త్ బులిటెన్


హీరో సాయి ధరమ్ తేజ్ గత రాత్రి హైదరాబాద్ లోని దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్పోర్ట్స్ బైక్ స్కిడ్ అయ్యి పడిపోయిన ఘటనలో ఆయనకీ మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ లో ప్రధమ చికిత్స అందించిన తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పిటల్ కి తరలించారు. సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్, అల్లు అరవింద్, వరుణ్ తేజ్, వైష్ణవ తేజ్, నిహారికలు హుటాహుటిన మాదాపూర్ మెడికవర్ హాస్పిటల్ కి చేరుకున్నారు. తర్వాత సాయి ధరమ్ ని అపోలో కి  తరలించారు. 

Advertisement
CJ Advs

అపోలో కి చిరు ఆయన భార్య సురేఖ వెళ్లారు. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉంది అని.. అయితే సాయి ధరమ్ తేజ్ షోల్డర్ బోన్ విరిగింది అని, ప్రస్తుతం వెంటిలేటర్ పైనే సాయి ధరమ్ తేజ్ కి చికిత్స అందిస్తున్నట్లుగా ఆయనని ట్రీట్ చేస్తున్న ముగ్గురు డాక్టర్స్ సాయి ధరమ్ తేజ్ ఫస్ట్ హెల్త్ బులిటెన్ విడుదల చేసారు. ప్రస్తుతం ప్రాణాపాయం లేదని.. మరికొద్దిసేపట్లొ సాయి ధరమ్ తేజ్ సెకండ్ హెల్త్ బులిటెన్ ని విడుదల చేస్తే సాయి ధరమ్ తేజ్ కండిషన్ ఎలా ఉందొ.. తెలుస్తుంది అని, రాత్రి నుండి పవన్ కళ్యాణ్ అపోలో హాస్పిటల్ లోనే ఉండి.. మేనల్లుడి హెల్త్ కండిషన్ తెలుసుకుంటున్నారని తెలుస్తుంది. 

Sai Dharam Tej Health Bulletin:

Sai Dharam Tej Accident Health Bulletin Released by Apollo Hospital Doctors
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs