Advertisement
Google Ads BL

చిరు, పవన్ పరామర్శ.. అపోలో కి తరలింపు


మెగా హీరో సాయి ధరమ్ తేజ్.. హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 దుర్గమ్మ చెరువు కేబుల్ బ్రిడ్జ్ మీదుగా గచ్చిబౌలి వైపు స్పోర్ట్స్ బైక్ నడుపుతూ.. ఇసుక మీద బైక్ స్కిడ్ అయ్యి పడిపోవడంతో.. సాయి ధరమ్ కి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే సాయి ధరం ని మాదాపూర్ లోని మెడికవర్ హాస్పిటల్ కి తరలించి వైద్యం అందిస్తున్నారు. మెగా ఫ్యామిలీ హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మేనల్లుడు సాయి ధరమ్ కి యాక్సిడెంట్ అయ్యింది అని  తెలియగానే హుటాహుటిన మేనల్లుడి ని పరామర్శించడం కోసం మెడికవర్ హాస్పిటల్ కి వచ్చారు. పవన్ వెంట ఆయన ఫ్రెండ్ టాప్ డైరెక్టర్ త్రివిక్రమ్ ఉండగా.. వరుణ్ తేజ్, అల్లు అరవింద్, నిహారిక, ఇంకా సాయి ధరమ్ కుటుంబ సభ్యులు మెడికవర్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఇంకా సందీప్ కిషన్ మరికొంతమంది సాయి ధరమ్ ఫ్రెండ్స్ హాస్పిటల్ కి రాబోతున్నారు. 

Advertisement
CJ Advs

సాయి ధరమ్ తేజ్ కి ప్రమాదం జరిగిన వెంటనే ఆయన అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయినా.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ప్రమాదం నుండి బయట పడ్డారని, 120 వేగంతో బైక్ నడుపుతున్నారని..  బైక్ నడిపే సమయంలో తలకి హెల్మెట్ పెట్టుకోవడం వలన తీవ్ర ప్రమాదం తప్పింది.. అని మెరుగైన వైద్యం కోసం సాయి ధరమ్ ని మెడికవర్ హాస్పిటల్ నుండి జూబ్లీహిల్స్ లోని అపోలో హాస్పటల్ కి తరలించబోతున్నట్టుగా పోలీస్ లు తెలిపారు.

Sai Dharam Tej met with an accident Pawan kalyan Chiranjeevi reaches hospital ...:

 Actor Sai Dharma Tej injured in road accident at Madhapur
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs