Advertisement
Google Ads BL

గోపీచంద్ ని సేవ్ చేసిన హీరో నాని


వినాయకచవితి రోజున మీడియం బడ్జెట్ మూవీస్ బాక్సాఫీసు ఫైట్ ఎప్పటి నుండో థియేటర్స్ దగ్గర నడుస్తుంది. కానీ కరోనా కష్ట కాలంలో సినిమాల మీద సినిమాలు పోటీ పడితే.. నిర్మాతలకు లాస్ తప్ప ఇంకేం లేదు. అసలే ఆరు నెలల క్రితమే విడుదల కావాల్సిన సినిమాలు.. ఇప్పుడు విడుదల అవుతున్నాయి. ఫైనాన్స్ తెచ్చుకున్న నిర్మాతలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ రోజు లవ్ స్టోరీ విడుదల కావాల్సి ఉండగా.. నాని టక్ జగదీశ్ మేకర్స్ తమ సినిమాని ఓటిటి  వినాయక చవితి రోజునే స్ట్రీమింగ్ అంటూ ప్రకటించారు. దానితో లవ్ స్టోరీ వెనక్కి వెళ్ళిపోయింది. 

Advertisement
CJ Advs

ఇక ఆ ప్లేస్ లోకి గోపీచంద్ సీటీ మార్ వచ్చి చేరింది. నాని టక్ జగదీశ్, గోపీచంద్ సీటిమార్ లు ప్రమోషన్స్ లో పోటీ పడ్డాయి. రెండు సినిమాల టీమ్స్ ప్రమోషన్స్ జోరుగా చేసారు. అయితే రెండు సినిమాలు బాక్సాఫీసు ఫైట్ అయితే గనక మాములుగా ఉండేది కాదు. కానీ టక్ జగదీష్ గత రాత్రి 9 గంటలకే అమెజాన్ ప్రైమ్ లో అందుబాటిలోకి వచ్చేసింది. దానితో నాని ఫాన్స్ తో పాటుగా బోలెడంత మంది సినీ లవర్స్ సినిమాని అమెజాన్ ప్రైమ్ లో ఇంట్లో కూర్చుని చూసేసారు. 

ఇక ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన సీటిమార్ సినిమాకి ఫ్రెష్ గా థియేటర్స్ కి వెళ్ళేవాళ్ళు ఉన్నారు. నాని సినిమా గత రాత్రే అందుబాటులోకి రావడంతో.. సీటిమార్ కి కలిసొచ్చింది. లేదంటే టక్ జగదీశ్ ఇంట్లో వీక్షిస్తూ ఉంటె సీటిమార్ థియేటర్స్ దగ్గర ప్రేక్షకులు తగ్గేవారే. అలా నాని గోపీచంద్ ని సేవ్ చేసాడు. 

Nani, the hero who saved Gopichand:

Nani Tuck Jagadish, Gopichand Seetimaarr Releasing on Vinayaka Chavithi special
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs