Advertisement
Google Ads BL

బసవతారకంలో బాలయ్య పండగ


వినాయకచవితి పర్వదినాన్ని పురస్కరించుకొని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ లో గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.  నేటి ఉదయం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసిన వినాయకునికి శ్రీ నందమూరి బాలకృష్ణ, ఛైర్మన్, బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చి ఇన్సిస్టిట్యూట్ వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు.  పూజానంతరం ప్రసాద వితరణ చేశారు.  

Advertisement
CJ Advs

ఈ సందర్భంగా శ్రీ నందమూరి బాలకృష్ణ తెలుగు ప్రజలకు ప్రత్యేక వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు.  ప్రజలెదుర్కొంటున్న విఘ్నాలన్నీ తొలగిపోవాలని ఆకాంక్షించారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ నందమూరి బాలకృష్ణ తో పాటూ డా. ఆర్ వి ప్రభాకర రావు, CEO, BIACH&RI; డా. ఫణి కోటేశ్వర రావు, మెడికల్ సూపర్నింటెండెంట్, BIACH&RI లతో పాటూ హాస్పిటల్ కు చెందిన వైద్యులు, వైద్యేతర సిబ్బంది పాల్గొన్నారు.  అంతకు ముందు హాస్పిటల్ ఆవరణలో ఉన్న గణేష్ మందిరంలో శ్రీ బాలకృష్ణ ప్రత్యేక పూజలు చేశారు.

Balakrishna Special Puja at Basavatarakam Hospital:

Balakrishna Special Vinayaka Chaviti Puja at Basavatarakam Hospital
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs