Advertisement
Google Ads BL

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సింగర్ చిన్మయి లుక్


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

Advertisement
CJ Advs

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తాజాగా ఈ సినిమాలో సింగర్ చిన్మయి ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. అఖిల్ సినిమాలో తొలిసారి స్క్రీన్ పై కనిపిస్తున్నారు. ఈమె పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చెప్పిన కథ నచ్చడంతో చిన్మయి తెర ముందుకు వస్తున్నారు. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.

Most Eligible Bachelor Singer Chinmayi Look:

 Singer Chinmayi Big-Screen Debut with Most Eligible Bachelor 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs