బిగ్ బాస్ సీజన్ 5 ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని బిగ్ బాస్, బుల్లితెర ప్రేక్షకులు ఎంతగా ఎదురు చూసారో.. అంత స్పీడుగానే తెలుగులో నాగార్జున హోస్ట్ గా బిగ్ బాస్ సీజన్ 5 మొదలైపోయింది. ఎన్నో అంచనాల మధ్యన మొదలైన బిగ్ బాస్ షో డే వన్ నుండే ప్లాప్ షో గా కనిపిస్తుంది. కారణం బిగ్ బాస్ హౌస్ లో పేరున్న సెలబ్రిటీస్ పెద్దగా లేదు. యాంకర్ రవి తప్ప పెద్దగా పేరున్న, క్రేజున్న సెలబ్రిటీస్ హౌస్ లో కనిపించడం లేదు. బిగ్ బాస్ హౌస్ లో మొత్తం 19 మంది కంటెస్టెంట్స్ ఉన్నారు.. అందరూ సంతలా కనిపిస్తున్నారు... తప్ప ఒక్కళ్ళు క్రేజీగా కనిపించడం లేదు.
అసలు ఈసారి స్టార్ మా కి పేరున్న సెలబ్రిటీస్ దొరకనే లేదు. బి బాస్ హౌస్ కి వెళితే.. తమ పేరు పోతుంది, పర్సనల్స్ బయటికి వస్తాయి. బిగ్ బాస్ సీజన్ 4 కంటెస్టెంట్స్ తప్ప మిగతా సీజన్స్ వారు ఎక్కడా హైలెట్ అవడం లేదు. ప్రస్తుతం కాస్తో కూస్తో పేరు, క్రేజు ఉన్నాయి. బిగ్ బాస్ హౌస్ కి వెళితే అది పోతుంది అని.. స్టార్ మా ఛాన్స్ ఇచ్చినా రావడం లేదని మొహమాటం లేకుండా చెప్పేశారట. దానితో చేసేదిలేక స్టార్ మా కేవలం యూట్యూబ్ స్టార్స్ తోనే సరిపెట్టేసింది. ఎలాగో యాంకర్ రవిని బతిమిలాడి.. భారీ పారితోషకానికి ఒప్పించి తీసుకొచ్చింది. అదన్నమాట.. ఈసారి బిగ్ బాస్ లో సెలబ్రిటీస్ లేకపోవడానికి కారణం.