పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలు, సినిమా షూటింగ్స్ తో బాగా బిజీగా మారారు. ప్రస్తుతం సాగర్ కె చంద్ర దర్శకత్వంలో భీమ్లా నాయక్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ వచ్చే నెల నుండి క్రిష్ హరి హర వీరమల్లు, అలాగే హరీష్ శంకర్ తో చెయ్యబోయే PSPK 28 షూటింగ్ కోసం రెడీ అవుతారు. ఇప్పటికే క్రిష్ ఏ ఎమ్ రత్నం, మైత్రి మూవీ నిర్మాతలు, హరీష్ శంకర్ తో చర్చల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఢిల్లీ రాజకీయాలతో బిజీగా ఉన్నారు.
అయితే పవన్ కళ్యాణ్ - హరీష్ కాంబో PSPK 28 కి సంబందించిన పవర్ ప్యాకెడ్ ఎనౌన్సమెంట్ రేపే రాబోతుంది అది కూడా ఉదయం 9.45 నిమిషాలకు అంటూ మేకర్స్ అప్ డేట్ ఇవ్వడంతో.. పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే హరీష్ - పవన్ PSPK 28 ప్రీ లుక్ తో సినిమాపై అంచనాలు పెంచేస్తున్నారు. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తుంటే.. హీరోయిన్ గా పూజ హెగ్డే పేరు ప్రచారం లో ఉంది. ఇక టైటిల్ గా కూడా కొన్ని టైటిల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. మరి రేపు ఉదయం రాబోయే PSPK 28 అప్ డేట్ కోసం పవన్ ఫాన్స్ అప్పుడే సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేసారు.