బిగ్ బాస్ సీజన్ వన్ నుండి సీజన్ 4 వరకు ఎలా సాగిందో.. మొత్తం ఒంటబట్టించుకుని మరీ.. బిగ్ బాస్ 5 కంటెస్టెంట్స్ 19 మంది బిగ్ బాస్ సీజన్ 5 హౌస్ లోకి అడుగుపెట్టినట్లుగా డే 1 నుండే కనిపిస్తుంది. బిగ్ బాస్ హిందీ కి ఉన్న క్రేజ్ సౌత్ కి లేదు. అందుకే సౌత్ బిగ్ బాస్ మొత్తం స్క్రిప్ట్ ప్రకారమే నడుస్తుంది అనే ప్రచారం లేకపోలేదు. ఇక తెలుగులో గత సీజన్ లోనే, బిగ్ బాస్ హౌస్ లో ప్రేమ పక్షులు, ఏడుపులు, పెడబొబ్బలు, సింపతీ ఇవన్నీ బాగా పని చేసాయి. అందుకే ఈ సీజన్ లో అడుగుపెట్టిన కంటెస్టెంట్స్ అప్పుడే బిగ్ బాస్ గేమ్ మొదలు పెట్టేసారు.
మొదటి రోజు నుండే హౌస్ లో ఉన్న చిన్నా చితక సెలబ్రిటీస్ అందరూ.. చేస్తే ఫైటింగ్, లేదంటే ఏడవడం, ఆఖరికి యాక్టర్ విశ్వ కూడా వెక్కి వెక్కి ఏడుస్తూ సింపతీ పొందడానికి ట్రై చేసాడనే అనిపిస్తుంది.. గత రాత్రి ఎపిసోడ్ చూస్తే. ఇక యాని మాస్టర్ అయితే గోల గోల, రచ్చ రచ్చ, ఏడుపు అబ్బో బిగ్ బాస్ సీజన్ 5 కొత్తగా ఉంటుంది అనుకుంటే.. ఎప్పటిలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తమ గేమ్ ని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో డే 1 నుండే స్టార్ట్ చేసి బుల్లితెర ప్రేక్షకులని అయోమయంలో పడేస్తున్నారు.