బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. అక్షయ్ కుమార్ తల్లి అరుణ భాటియా తీవ్ర అనారోగ్యంతో కొన్ని రోజులుగా ముంబైలోని హరినందానీ హస్పిటల్‌లోని ఐసీయూ ఉన్నారు. తల్లి అనారోగ్యంతో ఎక్కడో విదేశాల్లో షూటింగ్ లో ఉన్న అక్షయ్ కుమార్ షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని ముంబై వచ్చేసారు. అక్షయ్ కుమార్ కి అండగా ఆయన అభిమానులు నెటిజెన్స్ అరుణా భాటియా ఆరోగ్యం కుదుట పడాలి అంటూ ప్రార్థిస్తున్నారు.
అయితే అభిమానులు, అక్షయ్ కుమార్ ప్రార్ధనలూ నిరుపయోగం అయ్యాయి. అక్షయ్ తల్లి అరుణ భాటియా ఆరోగ్యం విషమించడంతో ఆమె మృతి చెందారు. ఈ విషయాన్నీ అక్షయ్ కుమార్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసారు. నా తల్లి శ్రీమతి అరుణ భాటియా ప్రశాంతంగా ఈ లోకం నుంచి వెళ్లిపోయారు. పరలోకంలో ఉన్న నా తండ్రిని చేరుకొనేందుకు ఆమె కూడా వెళ్లారు. నా కుటుంబం అత్యంత విషాదంలో ఉన్న సమయంలో నా తల్లి ఆరోగ్యం కోసం మీరు చేసిన ప్రార్ధనలు ఎప్పటికి గౌరవిస్తానుగా అంటూ అక్షయ్ ట్వీట్ చేసారు. పలువురు ప్రముఖులు అక్షయ్ కుమార్ తల్లి మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నరు.