మా ఎన్నికలు ఇప్పుడు టాలీవుడ్ లో అగ్గి రాజేస్తున్నాయి. మా ఎన్నికలు ఇప్పుడు ఎప్పుడు మెగా ఫ్యామిలీ చుట్టూనే తిరుగుతున్నాయి. ప్రకాష్ రాజ్ ప్యానల్ ని మెగా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తుంది అని, చిరు మా సభ్యులకి లేఖ రాయడం అన్ని విషయాల్లో మా ఎన్నికలు మేటర్ మెగా ఫ్యామిలీ ఇన్వల్వెమెంట్ ఉంటుంది.. తాజాగా మెగా ఫ్యామిలీ పై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జీవిత రాజశేఖర్ ప్రకాష్ రాజ్ ప్యానల్ కి వెళ్లడంతో.. బండ్ల గణేష్ ప్రకాష్ రాజ్ ప్యానల్ నుండి బయటికి వచ్చేసాడు. అయితే ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్యానల్ లో ఉన్న జీవిత మీద గణేష్ జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసి గెలుస్తాను అని.. చెబుతున్నాడు.
అంతేకాదు తన మాట నమ్మండి అని, మనస్సాక్షికి నచ్చకే ఆ ప్యానల్ నుంచి బయటకు వచ్చానని.. నిజంగా నేను దేవుడి లాంటి పవన్ కళ్యాణ్ మీద ఒట్టు వేసి చెబుతున్నా అని, మెగా ఫ్యామిలీ మీద జీవిత చేసిన వ్యాఖ్యలకు మెగా ఫ్యామిలీ క్షమించవచ్చేమో కానీ, తాను మాత్రం క్షమించలేనని చెప్పారు. అంతేకాకుండా మెగా ఫ్యామిలీ సభ్యులకు క్షమాగుణం ఎక్కువని... కానీ తాను మెగా ఫ్యామిలీ గొప్పవాడిని కాదని అంటూ తనని నమ్మమని చెబుతున్నాడు బండ్ల గణేష్.