Advertisement
Google Ads BL

వైసీపీ నేతని అరెస్ట్ చేసిన ఒడిశా పోలీస్


ఓ చిట్ ఫండ్ కేసులో వైసీపీ నేత అరెస్ట్ అవడం ఏపీలో కలకలం రేపింది.  వైజాగ్ మాజీ ఎమ్మెల్యే మళ్ల విజయప్రసాద్ ను చిట్ ఫండ్ కేసులో ఒడిశా పోలీసులు అరెస్ట్ చేశారు. విజయప్రసాద్ ప్రస్తుతం ఏపీ ఎడ్యుకేషన్ వెల్ఫేర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్న ఆయన 2019లో చిట్ ఫండ్ లో అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై ఒడిశాలో కేసు నమోదైంది. 

Advertisement
CJ Advs

విజయప్రసాద్ ని అరెస్ట్ చేసిన ఒడిశా సీఐడీ పోలీసులు తొలుత విశాఖ కేజీహెచ్ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. అనంతరం మేజిస్ట్రేట్ అనుమతితో ఒడిశా తరలించారు. మళ్ల విజయప్రసాద్ కు చిట్ ఫండ్ వ్యాపారం కూడా ఉంది. ఏపీలోనూ, పలు ఇతర రాష్ట్రాల్లోనూ బ్రాంచీలు ఏర్పాటు చేశారు. అయితే, తమకు చెల్లింపులు జరపడం లేదంటూ కొందరు డిపాజిట్ దారులు ఫిర్యాదు చేయడంతో ఆయనపై రెండేళ్ల కిందటే ఒడిశాలో కేసు నమోదైంది. ప్రస్తుతం ఆయనని ఒడిశా పోలీస్ లు అదుపులోకి తీసుకుని విచారిస్తునాన్రు. 

YCP leader Malla Vijay Prasad arrested:

Odisha police arrest Malla Vijay Prasad
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs