యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసుకుని.. ఎవరు మీలో కోటీశ్వరులు గేమ్ షో కి హోస్ట్ గా చేస్తున్నారు. ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ పూర్తయినా.. ఆర్.ఆర్.ఆర్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వున్నా.. ఎన్టీఆర్ తన కొమరం భీం పాత్రకి డబ్బింగ్ చెప్పేసి తన నెక్స్ట్ మూవీ కోసం రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ఆర్.ఆర్.ఆర్ మూవీ దసరా బరిలో లేనట్లే అంటున్నారు. ఇక ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ డేట్ తో హీరోలకి పని లేదు కాబట్టి తమ తదుపరి మూవీస్ కోసం హీరోలు జంప్ అవుతున్నారు. ఎన్టీఆర్ తన నెక్స్ట్ మూవీ కొరటాల శివ తో మొదలు పెట్టేందుకు రెడీ అవుతున్నాడు. NTR30 పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ అంటున్నారు.
హీరోయిన్ గా కియారా అద్వానీ పేరు బాగా వినిపిస్తుండగా.. తాజాగా అనన్య పాండే పేరు ప్రచారంలోకి వచ్చింది. అయితే NTR30 ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. కారణం ఏమిటంటే కొన్ని రోజుల్లోనే కొరటాల - ఎన్టీఆర్ కాంబో NTR30 పై నిర్మాతలు క్రేజీ అప్ డేట్ ఇవ్వబోతున్నారంటూ ఎన్టీఆర్ ఫాన్స్ సోషల్ మీడియాలో NTR30 ని ట్రెండ్ చేస్తున్నారు. త్వరలోనే మ్యూజిక్ డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఎనౌన్సమెంట్ ఉండబోతుంది అని, నవంబర్ సెకండ్ వీక్ నుండి రెగ్యులర్ షూట్ కి వెళ్లబోతుంది అంటూ హడావిడి మొదలు పెట్టారు ఎన్టీఆర్ ఫాన్స్.