Advertisement
Google Ads BL

ఈవారం థియేటర్స్ vs ఓటిటి


సినిమా థియేటర్స్ ఓపెన్ అయ్యాక మధ్యలో రాజరాజ చోర తప్ప ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసిన సినిమాలేవీ లేవనే చెప్పాలి, ప్రతి వారం కుప్పలు తెప్పలుగా సినిమాలు రిలీజ్ అవడమే కానీ.. అందులో ఆయమన్న సినిమాలు లేకపోవడంతో ప్రేక్షకులు పెద్దగా థియేటర్స్ కి రావడం లేదు. దానితో ఆ సినిమాలు కూడా సో సో గా రన్ అయ్యి వెళ్లిపోతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ తర్వాత పూర్తిగా ప్రేక్షకుల చూపు థియేటర్స్ వైపు పడడం లేదు. చాలామంది మూవీ లవర్స్ హా థియేటర్స్ లో రిలీజ్ అయితే ఏమి... ఓటిటి లో వచ్చేస్తాయి కదా అప్పుడు చూద్దామనుకుంటున్నారు. అలాంటి టైం లో ఈ వినాయకచవితి పోరు చూస్తే థియేటర్స్, ఓటిటి లు నువ్వా - నేనా అని పోటీ పడుతున్నాయి. 

Advertisement
CJ Advs

థియేటర్స్:

వినాయకచవితికి విడుదల కావల్సిన నాగ చైతన్య లవ్ స్టోరీ పోస్ట్ పోన్ అవగా.. ఆ ప్లేస్ లోకి గోపీచంద్ సీటిమార్ వచ్చేసింది. గోపీచంద్ - తమన్నా జంటగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కిన సీటిమార్ సెప్టెంబర్ 10 న థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. తమిళం నుండి విజయ్ సేతుపతి - శృతి హాసన్ జంటగా తెరకెక్కిన లాభం మూవీ ఒకరోజు ముందే అంటే 9 న రిలీజ్ కాబోతుంది. మరోపక్క జయలలిత బయోపిక్ తలైవి కూడా సెప్టెంబర్ 10 నే రిలీజ్ అవుతుంది. కంగనా జయలలితగా నటించిన ఈ సినిమాని విజయ్ తెరకెక్కించారు. అరవింద్ స్వామి ఎంజీఆర్ పాత్రలో కనిపించబోతున్న ఈ సినిమాని పలు భాషల్లో థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. 

ఇంకా జాతీయ రహదారి అనే చిన్న సినిమా కూడా అదే రోజు థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. 

ఓటిటి:

మొదటి నుండి మా సినిమా థియేటర్స్ లోనే అన్న నాని టక్ జగదీశ్ మేకర్స్ యు టర్న్ తీసుకుని.. టక్ జగదీశ్ ని ఓటిటి నుండి సెప్టెంబర్ 10 నే రిలీజ్ చెయ్యబోతున్నారు. టక్ జగదీశ్ థియేటర్స్ లో కాకుండా ఓటిటి లో రిలీజ్ చేయడంపై ఫాన్స్, మూవీ లవర్స్ నుండి తీవ్ర వ్యతిరేఖత ఎదుర్కొంది టీం. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ నుండి ప్రేక్షకుల్ ముందుకు రానుంది. 

ఇక రాహుల్ రామ కృష్ణ నెట్ మూవీ కూడా ఓటిటి నుండే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా జీ5 ఓటీటీ వేదికగా సెప్టెంబరు 10 నుంచి స్ట్రీమింగ్‌ కానుంది. ఇంకా ముంబై డైరీస్‌ 26/1, విజయ్ సేతుపతి ల తుగ్లక్ దర్బార్ కూడా ఓటిటినుండే రిలీజ్ కాబోతుంది. మరి ఈ వినాయక చవితికి థియేటర్స్ vs ఓటిటి అన్నట్టుగా ఉన్నా.. కాస్త ఇంట్రెస్టింగ్ గానే అనిపిస్తుంది. 

Theaters vs OTT:

This Friday Release Movie list
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs