Advertisement
Google Ads BL

నరేష్ పార్టీ పై ప్రకాష్ రాజ్ కామెంట్స్


ప్రస్తుత మా అధ్యక్షుడు నరేష్ మళ్ళీ మా ఎన్నికల్లో అధ్యక్షుడిగా పోటీ చేస్తారో లేదంటే మంచు విష్ణు కోసం ఈ ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానల్ ని ఢీ కొంటారో తెలియదు కానీ.. నరేష్ ఇప్పుడు హైదరాబాద్ లోని ఓ హోటల్ లో ఇవ్వబోయే వీకెండ్ పార్టీ హాట్ టాపిక్ గా మారింది. నరేష్ ఈ రోజు సాయంత్రం హైదరాబాద్ లోని ఓ రిచ్చెస్ట్ హోటల్ లో ఇండస్ట్రీ ప్రముఖులకు గ్రాండ్ గా పార్టీ ఏర్పాటు చేసి ఇన్విటేషన్స్ పంపినట్లుగా ఓ మెసేజ్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అయితే ఈ పార్టీపై మా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్ మాట్లాడారు.

Advertisement
CJ Advs

నరేష్ ఎందుకు పార్టీ ఇస్తున్నారో..  వారి పర్సనల్ క్యాంపెయిన్ వారు చేసుకుంటారు.. ఎవరు ఇష్టమొచ్చినట్టుగా వారు క్యాంపైన్ చేసుకోవచ్చు. అయితే పొలిటికల్ పార్టీల వారు తిరిగినట్టుగా ఇంటింటికి తిరిగి ప్రచారం చేసుకోలేం.. మేం అంతా నటులం. అలా సాయంత్రం కలుసుకుంటాం.. ఎవరు ఏ పార్టీ అయినా చేసుకోవచ్చు.. అందరిని ఆపార్టీకి పిల్చుకోవచ్చు.. ఏమైనా మాట్లాడుకోవచ్చు.. అలా ఒకచోట అందరూ కూర్చుని మాట్లాడుకుంటారు, ఆ మీటింగ్ లో కలలను పంచుకుంటారు.. కలిసి తింటారు.. మందు కూడా తాగుతారేమో ఎవరికి తెలుసు అంటూ ప్రకాష్ రాజ్ నరేష్ పార్టీపై గుంభనంగా స్పందించారు.

Prakash Raj comments on Naresh party:

Prakash Raj comments maa elections
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs