Advertisement
Google Ads BL

నటుడు కృష్ణుడు అరెస్ట్


ఒకప్పుడు సైడ్ కేరెక్టర్స్ చేస్తూ తర్వాత హీరోగా మారి.. ప్రస్తుతం నటనకు దూరమైన కృష్ణుడు.. పెళ్లి చేసుకుని వ్యాపారం చేసుకుంటున్నాడని అందరూ అనుకుంటున్నారు. కానీ కృష్ణుడు సినిమాల నుండి దూరమైన తర్వాత కృష్ణుడు ఏం చేస్తున్నాడు అనేది ఎవరికీ తెలియదు. తాజాగా కృష్ణుడుని పోలీస్ లు అరెస్ట్ చెయ్యడం కలకలం రేపింది. నిన్న రాత్రి స్పెషల్ బ్రాంచ్ పోలీస్ లు నటుడు కృష్ణుడుని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది. మియాపూర్ దగ్గరలోని శిల్ప పార్క్ విల్లాలో పేకాట ఆడుతున్న కృష్ణుడుని అక్కడ పేకాట నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకులని అరెస్ట్ చేసినట్లుగా తెలుస్తుంది.

Advertisement
CJ Advs

ఈ పేకాట శిబిరంలో పలువురు సినీ ప్రముఖులతో పాటు బిజినెస్ మ్యాన్ లు కూడా పాల్గొంటున్నారని సమాచారంతో నిన్న రాత్రి మాదాపూర్ కి చెందిన ఎస్వోటీ పోలీసులు పక్కా ప్లాన్ తో దాడి చెయ్యడంతో.. నటుడు కృష్ణుడు తో పాటు మరో ఎనిమిదిమంది ని పోలీస్ లు అరెస్ట్ చేసి స్టేషన్ కి తరలించారు. ఆ తర్వాత వ్యక్తిగత పూచీకత్తు మీద వీరిని విడిచి పెట్టిన.. మళ్ళీ సాయంత్రం తమ ముందు హాజరు కావలసిందిగా నోటీసులు ఇచ్చారని అంటున్నారు.

Actor Krishnudu nabbed by Hyderabad police while playing poker:

Krishnudu nabbed by Hyderabad police while playing poker
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs