గత కొన్ని రోజులుగా సమంత పేరు సోషల్ మీడియాలో హైలెట్ అవుతుంది. ప్రేమించి పెళ్లాడిన భర్త నాగ చైతన్య కి సమంత విడాకులు ఇవ్వబోతుంది, నాగ చైతన్య తో సమంత విభేదాలు అంటూ ప్రచారం జరుగుతుంది. మాములుగా సెలబ్రిటీస్ విషయంలో సోషల్ మీడియా అత్యుత్సాహం చూస్తుంటాము. తాజాగా సమంత ఎన్నడూ లేని రూమర్స్ ని ఎదుర్కొంటుంది. అయినప్పటికీ సమంత నుండి స్పందన లేదు. కనీసం చైతు కానీ, సమంత కానీ క్లారిటీ ఇస్తే ఈ రూమర్స్ కి అడ్డుకట్టపడేది.
తాజాగా సమంత షూటింగ్స్ కి బ్రేకిచ్చి ఎక్కడికో ఒంటరి ప్రయాణం అంటూ ప్రచారం జరుతుంది. అలాగే సోషల్ మీడియాలో తన ఇన్స్టా అకౌంట్ లో స్టోరీ పోస్ట్ చేసింది. తన ఫ్రెండ్స్ తో సమంత సైక్లింగ్ చేస్తూ ఉత్సాహంగా ఉంది. అలాగే ముక్కుకు ముక్కెర పెట్టుకుని కొత్త స్టయిల్ లో కనిపిస్తుంది సమంత. చక్కటి గ్లామర్ డ్రెస్ తో సమంత ముక్కు కి ముక్కెర తో కొత్త స్టయిల్లో అదరగొట్టేసింది. మరి మీరు సమంత ముక్కెర పిక్ ని ఓ లుక్కెయ్యండి.