Advertisement
Google Ads BL

సిద్దార్థ్‌ శుక్లా డెత్ రిపోర్ట్


బాలీవుడ్ క్రేజీ నటుడు సిద్దార్థ్‌ శుక్లా నిన్న గురువారం ఉదయం హార్ట్ ఎటాక్ తో కన్ను మూయడం యావత్ సినిమా ప్రపంచాన్ని మూగబోయేలా చేసింది. సీరియల్స్ లో నటించే సిద్దార్థ్‌ శుక్లా బిగ్ బాస్ సీజన్ 13 ద్వారా విపరీతమైన పాపులారిటీ పొంది.. స్టార్ హీరోల సినిమాల్లో మంచి మంచి కేరెక్టర్స్ తో దూసుకుపోతున్న టైం లో ఇలా మృతి చెందడం సినీ ప్రముఖుల్ని కలిచి వేసింది. ఇక బిగ్ బాస్ హౌస్ లో షెహనాజ్‌ తో ప్రేమాయణం నడిపిన సిద్దార్ద్ త్వరలోనే గర్ల్ ఫ్రెండ్ షెహనాజ్‌ ని వివాహం చేసుకోబోతున్నాడనే న్యూస్ కూడా నడించింది. 

Advertisement
CJ Advs

ఇక సిద్దార్ధ్ శుక్ల మరణంతో షెహనాజ్‌ షాక్ కి గురయ్యి.. ఎవ్వరితోనూ మాట్లాడాలనుకోవడం లేదని.. ఆఖరికి ఆమె సెల్‌ఫోన్‌ కూడా స్విచ్ఛాఫ్‌ చేసేసిందని ఆమె స్నేహితులు, తోటి నటీనటులు చెబుతున్నారు. మరోపక్క సిద్దార్థ్ మరణం సహజ మరణం కాదని, ఆయన మానసిక ఒత్తిడితోనే మరణించారంటూ రూమర్స్ రావడంతో సిద్ధార్ధ్ ఫ్యామిలీ వివరణ ఇచ్చింది. సిద్దార్ద్ తల్లి తన కొడుకు హార్ట్ ఎటాక్ తో చనిపోయాడని ఆయన మరణాన్ని ఇలా కాంట్రవర్సీ చెయ్యొద్దూ అని వేడుకున్నారు. తాజాగా సిద్దార్థ్ పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటికి వచ్చింది. 

అందులో సిద్దార్థ్ సహజసిద్ధంగానే మరణించారని, ఆయన ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని సిద్దార్ధ్ కి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్స్ రిపోర్ట్ ఇచ్చారు. డాక్టర్స్ సమక్షంలో పోలీస్‌ అధికారులు పోస్ట్‌మార్టంను చిత్రీకరించారు. ఆ తర్వాత శవ పంచనామా రిపోర్ట్ ని పోలీస్ లకి అందజేశారు డాక్టర్స్. 

Sidharth Shukla Post mortem Report:

No Injuries Found In Autopsy On Actor Sidharth Shukla
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs