కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో రామ్ చరణ్ RC15 మూవీ ఈ నెలలోనే మొదలు కాబోతుంది. సెప్టెంబర్ 13 న RC15 పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లో ఓ రేంజ్ లో జరగబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే తాజాగా RC 15 సినిమా మొదలు కాకుండానే వివాదాల్లో ఇరుక్కున్నట్లుగా తెలుస్తుంది. అంటే దర్శకుడు శంకర్ కి ఇలాంటి వివాదాలు కొత్త కాదు. గతంలోనూ కథ కొట్టేశారనే ఆరోపణలు దర్శకుడు శంకర్ పై ఉన్నాయి. కోర్టులో కూడా ఓ కేసు నడుస్తుంది. అలాగే తన అపరిచితుడు సినిమాని బాలీవుడ్ లో రణ్వీర్ సింగ్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్నారు శంకర్. ఇప్పుడు ఆ కథ విషయంలోనూ ఒరిజినల్ నిర్మాత గొడవ చేస్తున్నారు.
ఇప్పుడు RC15 కథ నాదే అంటూ ఓ యంగ్ డైరెక్టర్ బయలు దేరాడు. కార్తీక్ సుబ్బరాజ్ మాజీ అసోసియేట్ సెల్ల ముత్తు తన అనుమతి లేకుండా దర్శకుడు శంకర్ తన కథని దొంగిలించి RC15 చెయ్యబోతున్నారంటూ రచయితల సంఘంలో ఫిర్యాదు చెయ్యడం హాట్ టాపిక్ గా మారింది. కార్తీక్ సుబ్బరాజు ప్రొడక్షన్ కోసం తానూ కథ రాసుకుంటే.. ఆ కథను దర్శకుడు శంకర్ తనని సంప్రదించకుండా, తనకి ఎలాంటి డబ్బు కట్టకుండా కాజేసి ఆయన సినిమా కోసం వాడుకుంటున్నారంటూ రచయితల సంఘంలో సెల్ల ముత్తు ఫిర్యాదు చెయ్యడం పై RC15 ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది అని అంటున్నారు. మరి ఈ విషయమై శంకర్ కానీ, చరణ్ కానీ ఎలా స్పందిస్తారో చూడాలి.