Advertisement
Google Ads BL

నరేష్ పార్టీ దేని కోసం


ఈమధ్యన మా ఎన్నికల మేటర్ టాలీవుడ్ ని షేక్ చేస్తుంది. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు లు హోరా హోరిన మా ఎన్నికల్లో తలపడబోతున్నారు. మధ్యలో హేమ, జీవిత, నరసింహారావు, కాదంబరి కిరణ్ లు మా ఎన్నికల మేటర్ ని హైలెట్ చేస్తున్నారు. ఇక మా ప్రస్తుత అధ్యక్షుడు సీనియర్ నరేష్ మా ఎన్నికల మేటర్ ని అప్పుడప్పుడు కదుపుతున్నాడు. ఇక మొన్న నాగార్జున బర్త్ డే సెలెబ్రేషన్స్ లో నటుడు సమీర్ మా సభ్యులకి పార్టీ ఇస్తున్నట్టుగా కొంతమందికి ఆహ్వానాలు కూడా పంపినట్టుగా తెలిస్తోంది. ఇక తాజాగా మా అధ్యక్షుడు నరేష్ ఇవ్వబోయే ఓ స్పెషల్ వీకెండ్ పార్టీ ఇప్పుడు టాలీవుడ్ మీడియా సర్కిల్స్ లో హైలెట్ గా మారింది. 

Advertisement
CJ Advs

అసలు నరేష్ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారో తెలియదు కానీ.. హైదరాబాద్ నడిబొడ్డున దసపల్లా ఫోరమ్‌ హాల్‌లో శనివారం సాయంత్రం 6 గంటల నుంచి టాలీవుడ్ ప్రముఖుల మధ్యన ఈ పార్టీ జరగబోతుంది అంటూ నరేశ్‌ విజయ కృష్ణ పేరుతో ఓ వాట్సాప్‌ మెస్సేజ్‌.. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ పార్టీ ఇన్విటేషన్ ఈ రోజు అంటే.. శుక్రవారం అందరికీ ఆహ్వానం అందుతుందంటూ ఆ మెసేజ్ సారాంశం. మరి మా అధ్యక్షుడైన నరేష్ ఈ పార్టీ ఎందుకు ఇస్తున్నారో కానీ.. ఇప్పుడు ఈ వీకెండ్ పార్టీ దుమారం.. రాత్రి హైదరాబాద్ ని అకాల వర్షం ముంచెత్తినట్టుగా.. ఇప్పుడు ఇది టాలీవుడ్ ని ముంచెత్తింది. 

Party Invitation Message From MAA President Naresh:

MAA President Naresh Weekend Party?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs