Advertisement
Google Ads BL

రకుల్ రిక్వెస్ట్.. ఈడీ రిజెక్ట్


ప్రస్తుతం టాలీవుడ్ ని ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్) నోటీసు లు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టాలీవుడ్ లో 12 మంది టాప్ సెలెబ్రేటిస్ కి ఈడీ నోటీసు లు పంపడం హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటికే ఆ 12 మందిలో విచారణలో భాగంగా దర్శకుడు పూరి జగన్నాధ్, నటి ఛార్మి ఈడీ విచారనను ఎదుర్కొనగా.. రేపు 6 వ తేదీన నటి రకుల్ ప్రీత్ ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంది. అయితే గతంలో ఎక్సేంజ్ పోలీసులు డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ పేరు చేర్చకపోయినా.. ఈ మనీ లాండరింగ్ కేసులో రకుల్ పేరు బయటికి వచ్చింది. సెప్టెంబర్ 6 న రకుల్ ని విచారించడానికి ఈడీ రకుల్ కి డేట్ ఇచ్చి మరీ నోటీసు లు పంపింది. 

Advertisement
CJ Advs

అయితే ఆరో తేదీన తాను ఈడీ విచారణకు హాజరు కాలేను అంటూ ఈడీ ని రిక్వెస్ట్ చేసింది రకుల్ ప్రీత్. 

తాను వరస  సినిమా షూటింగ్స్ తో బిజీగా వున్న కారణముగా మీరు చెప్పిన తేదీన విచారణకు రాలేను అంటూ తనకి మరో డేట్ కేటాయించామని రకుల్ ఈడీ అధికారులని కోరగా.. ఈడీ రకుల్ రిక్వెస్ట్ ని రిజెక్ట్ చేసింది. రకుల్ విచారణకు గడువు ఇవ్వడం కుదరదని.. తాము చెప్పిన తేదిలోనే రకుల్ విచారణకు హాజరు కావాలని ఈడీ రకుల్ ని ఆదేశించింది. మరి రకుల్ ఈడీ అధికారులు ఇచ్చిన డేట్ సెప్టెంబర్ 6 న విచారణకు హాజరవుతుందో.. లేదో.. అనేది ఆసక్తికరంగా మారింది. 

Rakul Preet Request .. Ed Reject:

ED Officer rejects Rakul Preet request
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs