పవన్ కళ్యాణ్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ఆకాశాన్ని తాకాయి. పవర్ స్టార్ బర్త్ డే వేడుకల కోసం ఫాన్స్ తహతహలాడిపోయారు. ఆయన మూవీస్ అప్ డేట్స్ కోసం ఎదురు చూసారు. అన్నిటిని పవన్ కళ్యాణ్ తీర్చేసారు, ఫాన్స్ ని అడుగడుగునా సర్ ప్రైజ్ చేసారు. పవన్ కళ్యాణ్ కి మెగా ఫ్యామిలి హీరోలైన మెగాస్టార్ చిరు దగ్గర నుండి అల్లు అర్జున్ వారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ రీసెంట్ మూవీస్ అయిన భీమ్లా నాయక్ నుండి ఫస్ట్ సింగిల్ వదిలితే.. హరిహర వీరమల్లు నుండి రిలీజ్ డేట్ పోస్టర్ ని వదిలారు. అంతేకాకుండా సురేందర్ రెడ్డి మూవీ నుండి కూడా పవర్ స్టార్ కి బర్త్ డే విషెస్ పోస్టర్ వచ్చేసింది.
ఇక ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకి మైత్రి మూవీస్ నిర్మాణంలో హారిష్ శంకర్ - పవన్ కాంబో మూవీ అప్ డేట్ కూడా వచ్చేసింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ మోడరన్ బైక్ పై ఉన్న హాఫ్ లుక్ ని, బైక్ లుక్ ని వదిలారు. పవన్ కళ్యాణ్ కి బర్త్ డే విషెస్ తెలుపుతూ..
JAATHARA SHURU 🤙
Wishing our dearest @PawanKalyan garu a Blockbuster Birthday ❤️
జాతర షురూ చేసారు. మళ్ళీ ఫుల్లు లోడింగ్ అంటూ పవర్ స్టార్ స్టయిల్స్ హాఫ్ లుక్ ని రివీల్ చేసారు. పవన్ PSPK 28 నుండి వచ్చిన సర్ ప్రైజ్ కి పవన్ ఫాన్స్ ఫిదా అవుతున్నారు.