పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా పవన్ ఫాన్స్ చేసే హడావిడి సోషల్ మీడియాలో కనిపిస్తుంది. మరోపక్క పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా హోరెత్తిపోతుంది. ఇప్పటికే పవన్ - రానా కాంబోలో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ ని రివీల్ చేసింది టీం. ఇంకా ఆ సెలెబ్రేషన్స్ పూర్తి కాకుండానే.. పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో లో తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు మూవీ సర్ ప్రైజ్ కూడా వచ్చేసింది.
క్రిష్ - పవన్ కళ్యాణ్ కాంబోలో పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతున్న హరి హర వీరమల్లు షూటింగ్ జనవరిలోనే మొదలైనా సెకండ్ వేవ్ కరోనా వలన పోస్ట్ పోన్ అయ్యింది.. రెస్యూమ్ షూట్ ఇంతవరకు మొదలు కాలేదు. అయితే ఈ సినిమాని మొదట సంక్రాంతి 2022 జనవరి లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు మేకర్స్. కానీ ఇప్పుడు భీమ్లా నాయక్ హరిహర వీరమల్లు డేట్ అంటే జనవరి సంక్రాంతికి వస్తుంటే.. ఇప్పుడు హరిహర వీరమల్లు 2022 వేసవికి షిఫ్ట్ అయ్యింది. పవన్ బర్త్ డే సందర్భంగా హరిహర వీరమల్లు కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు. అది ఏప్రిల్ 29 న హరిహర వీరమల్లు ని రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా మేకర్స్ పోస్టర్ తో సహా ప్రకటించారు.