నేడు పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా రాజకీయ సినీప్రముఖులు ఆయనకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కి సినిమా ఇండస్ట్రీలో చిన్న పెద్ద నటీనటులు, రాజకీయ ప్రముఖులు విషెస్ చెబుతుంటే ఆయన నటిస్తున్న సినిమాల నుండి స్పెషల్ అప్ డేట్స్ తో ఆయన ఫాన్స్ తడిచి ముద్దవుతున్నారు. అయితే మెగా ఫ్యామిలిలో చిరు దగ్గర నుండి నిహారిక, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ, అందరూ పవన్ కళ్యాణ్ కి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసారు. అయితే మెగా హీరోలందరితో అల్లు అర్జున్ పవర్ స్టార్ ని విష్ చెయ్యడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
అంటే గతంలో పవన్ కళ్యాణ్ గురించి చెప్పమనగానే చెప్పను బ్రదర్ అంటూ ఓవర్ గా రియాక్ట్ అయిన అల్లు అర్జున్ అంటే పవన్ ఫాన్స్ ఆగ్రహంతో ఊగిపోతున్నారు. అల్లు అర్జున్ ఎక్కడికి వెళ్లినా పవన్ ఫాన్స్ రచ్చ రచ్చ చెయ్యడంతో పవన్ ఫాన్స్ అభిమానాన్ని కోల్పోయాడు అల్లు అర్జున్. మధ్యలో ఎన్నిసార్లు పవన్ తో మాట్లాడుతున్న ఫొటోస్ ని, పవన్ తో కలిసి ఉన్న ఫొటోస్ ని అల్లు అర్జున్స్ షేర్ చేసిన పవన్ ఫాన్స్ శాంతించలేదు.
నేడు పవన్ బర్త్ డే కి అల్లు అర్జున్ స్పెషల్ గా విష్ చేసాడు. Many many happy returns of the day to my Pawan Kalyan garu. May this day and the coming year bring you more n more pace and happiness.. హ్యాపీ బర్త్ డే పవన్ కళ్యాణ్ గారు.. మీరు ఈ ఏడాది మరిన్ని విజయాలు అందుకోవాలంటూ.. పవన్ ని హాగ్ చేసుకున్న పిక్ ని షేర్ చేసాడు. మరి అల్లు అర్జున్ ఇలా విష్ చెయ్యడంతో ఆయనపై ఉన్న కోపాన్ని పవన్ ఫాన్స్ తగ్గించుకునేలా కనిపిస్తుంది. అలాగే పవన్ ఫాన్స్ అల్లు అర్జున్ విషయంలో శాంతిస్తారనే అల్లు ఫాన్స్ కూడా ఎక్సపెక్ట్ చేస్తున్నారు.