పవన్ కళ్యాణ్ మెగాస్టార్ వారసుడిగా సినిమా తెరంగేట్రం చేసినా.. ఒక్క సినిమాతోనే సోలో గా తనకంటూ మాస్ ఇమేజ్ ని ఏర్పరుచుకుని టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో పొజిషన్ ని ఎంజాయ్ చేస్తున్న హీరో. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి తో వెండితెర కి పరిచయం అయిన పవన్ కళ్యాణ్ కెరీర్ లో బ్లాక్ బస్టర్స్ ఉన్నాయి. అట్టర్ ప్లాప్ మూవీస్ ఉన్నాయి. అయినా పవర్ స్టార్ అంటే ఫాన్స్ కి ప్రాణం. పవన్ ఫాన్స్ కి పవన్ కళ్యాణ్ పేరు చెబితే వైబ్రేషన్స్ వచ్చేస్తాయి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి తర్వాత పొలిటికల్ ఎంట్రీ ఇచ్చినా.. పవర్ స్టార్ ఇమేజ్ ఫాన్స్ లో ఇసుమంతైనా తగ్గలేదు.
వకీల్ సాబ్ తో రీ ఎంట్రీ ఇచ్చిన.. ఆయన క్రేజ్ తో నిర్మాతలకు లాభాల పంట పండించారు ఫాన్స్. పవన్ పవర్ స్ట్రోమ్ ఫ్యానిజం తో టాలీవుడ్ నెంబర్ వన్ గా మారిపోయాడు. మహేష్, పవన్ మధ్యలోనే ఈ టాప్ చైర్ ఎప్పటికప్పుడు దోబూచులాడుతోంది. ప్రభాస్ పాన్ ఇండియాకి వెళ్ళిపోయాడు. చరణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్ వీరంతా పవన్ కింద తగ్గాల్సిన వాళ్ళే.
ఇక పవన్ వకీల్ సాబ్ తర్వాత మలయాళ అయ్యప్పన్ కోషియం మూవీ రీమేక్ భీమ్లా నాయక్, హరి హర వీరమల్లు, హరీష్ తో మూవీ, సురేందర్ రెడ్డి తో మరో మూవీకి కమిట్ అయ్యారు. నేడు పవన్ బర్త్ డే స్పెషల్ గా ఆయా సినిమాల అప్ డేట్స్ తో సోషల్ మీడియా ని షేక్ చేస్తున్నారు పవన్ ఫాన్స్. పవనోత్సవం అంటూ గత కొన్ని రోజులకుగా పవన్ ని సోషల్ మీడియాలో ట్రేండింగ్ లో ఉంచిన పవన్ ఫాన్స్ కి నేడు పండగే. దసరా, సంక్రాంతి కన్నా ఎక్కువగా పవన్ బర్త్ డే సెలెబ్రేషన్స్ ని నిర్వహిస్తారు ఆయన ఫాన్స్. మరి నేడు పుట్టిన రోజు జరుపుకుంటున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి సినీజోష్ టీం తరుపున ఏ వెరీ హ్యాపీ బర్త్ డే.