Advertisement
Google Ads BL

పవన్ - క్రిష్ సినిమా అందుకే లేట్


పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అయ్యప్పన్ కోషియం రీమేక్ భీమ్లా నాయక్ పైనే ఫోకస్ పెట్టారు. రానా తో కలిసి భీమ్లా నాయక్ షూటింగ్ లో పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ చెయ్యాల్సిన మరో చిత్రంసెకండ్ వేవ్ పూర్తయినా ఇంతవరకు సెట్స్ మీదకెళ్ళలేదు. క్రిష్ దర్శకత్వంలో పవన్ చేస్తున్న హరిహర వీరమల్లు సినిమా రెస్యూమ్ షూట్ ఇంతవరకు మొదలు కాలేదు. క్రిష్ కూడా వైష్ణవ్ తేజ్ కొండ పొలం పోస్ట్ ప్రొడక్షన్ పనులని వేగంవంతం చేసాడు. అక్టోబర్ లో కొండ పొలం రిలీజ్ ఉంది. దాని కోసం క్రిష్ పవన్ సినిమాని పక్కనబెట్టలేదు. 

Advertisement
CJ Advs

కానీ పవన్ ఫస్ట్ భీమ్లా నాయక్ ని ఓ కొలిక్కి తెచ్చాకే హరి హర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అవ్వాలని చూస్తున్నారట. అంటే క్రిష్ తో పవన్ దాదాపుగా దసరా తర్వాతే సెట్స్ మీదకెళ్లే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే హరిహర వీరమళ్లు ఫస్ట్ హాఫ్ చిత్రీకరణ పూర్తవగా.. సెకండ్ హాఫ్ షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇక హరిహర వీరమల్లు సెకండ్ హాఫ్ మొత్తం యాక్షన్ తోనే నిడిపోతుందట. ఈ సెకండ్ హాఫ్ యాక్షన్ సీన్స్ కోసం క్రిష్ కొంచెం ఎక్కువ టైం తీసుకోబోతున్నాడట. 

ఇక ఈ సినిమా కోసం మరిన్ని సెట్స్ నిర్మాణం అవసరం ఉండబోతున్నట్లుగా తెలుస్తుంది. అన్నట్లు రేపు హరిహర వీరమల్లు అప్ డేట్ ఉంటుందో..  లేదో.. అనే అనుమానంలో పవన్ ఫాన్స్ ఉన్నారు. 

Pawan - Krish movie shoot resumes soon :

Pawan - Krish Hari Hara Veeramallu movie shoot soon
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs