ఎవ్వరి సినిమా పోస్ట్ పోన్ అయినా మా ఆర్.ఆర్.ఆర్ మాత్రం అక్టోబర్ 13 నే అంటూ పదే పదే చెప్పిన రాజమౌళి ఇప్పుడు ఆ డేట్ విషయంలో వెనక్కి తగ్గారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆర్.ఆర్.ఆర్ అక్టోబర్ 13 న రిలీజ్ కావడం అసాధ్యమని, అన్ని పనులు పూర్తయినా.. ప్రస్తుతం ప్రేక్షకులు ఇంకా థియేటర్స్ కి రావడానికి ఝన్కుతున్నారని.. అలాగే సెప్టెంబర్ లో థర్డ్ వేవ్ అంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ ని వాయిదా వెయ్యడమే ఉత్తమని భావిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
మరి ఒకవేళ సినిమాని పోస్ట్ పోన్ చేస్తే అది అధికారికంగా ప్రకటిస్తే మిగతా వాళ్ళు ముందుకొస్తారు. అంటే ఆచార్య, అఖండ లాంటి మేకర్స్ ముందుకొచ్చి సినిమా రిలీజ్ డేట్స్ ని దసరాకి ప్రకటిస్తారు. కానీ రాజమౌళి కన్ఫ్యూజ్ అవుతున్నారా? లేదంటే మిగతా నిర్మాతలని కన్ఫ్యూజ్ చేస్తున్నారో? కానీ ఆర్.ఆర్.ఆర్ విషయాన్నీ నాన్చుతూనే ఉన్నారు. మరోపక్క అక్టోబర్ 13 నుండి జనవరి 2022 సంక్రాంతికి ఆర్.ఆర్.ఆర్ వెళ్ళింది అంటూ ప్రచారం జరగడంతో సంక్రాంతి బరిలో లో ఉన్న సినిమాల్తో పాటుగా.. తమ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేస్తే బావుంటుంది అనుకుంటున్న నిర్మాతల గుండెల్లోనూ రాయి పడినట్లయ్యింది.
ఒకవేళ వచ్చే సంక్రాంతికే ఆర్.ఆర్.ఆర్ రిలీజ్ అంటే అప్పుడు ఒకటి లేదా రెండు సినిమాలు మత్రమే బరిలో ఉంటాయి తప్ప మిగతా వాళ్ళు రిలీజ్ చెయ్యడానికి ధైర్యం చెయ్యరు. సో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ డేట్ విషయంలో ఇలాంటి కన్ఫ్యూజన్ కి పొతే మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటో అంటున్నారు.