మనీ లాండరింగ్ కేసులో ఈ రోజు విచారణకు హాజరైన పూరి జగన్నాధ్ ని ఈడీ అధికారులు దాదాపుగా 10 గంటల పాటు విచారించారు. కొడుకు ఆకాష్ పూరి తో ఈ రోజు ఉదయమే పూరి ఈడీ ఆఫీస్ కి రావడం, మీడియా తో మాట్లాడకుండా విచారణకు వెళ్లిపోయారు పూరి. అయితే పూరి జగన్నాధ్ కేసులో నిర్మాత బండ్ల గణేష్ ఈడీ విచారణకు హాజరవడం హాట్ టాపిక్ గా మారింది. అయితే బండ్ల గణేష్ మాత్రం అమ్మ తోడు నాకేం తెలియదు. పూరి జగన్నాధ్ ను కలవడానికి మాత్రమే వచ్చాను. పూరి నామిత్రుడు ఉదయం వచ్చాడు. ఏం జరిగిందోనని టెన్షన్ గా ఉంది అందుకే తెలుసుకోడానికి వచ్చాను.. అంటూ మీడియాతో మాట్లాడాడు.
ఇక ఈ రోజు రాత్రి 9 గంటల వరకు పూరి విచారణగా సాగగా.. బండ్ల గణేష్ - పూరి తీసిన సినిమాల ఆర్థికలావాదేవీలపై పూరి ని ప్రశ్నించిన ఈడీ అధికారులు, మనీ లాండరింగ్, ఫెమా ఉల్లంఘనపై కూడా ఈడీ పూరి ని ప్రశ్నించినట్టుగా తెలుస్తుంది. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో సంబంధాలపై ఆరా తీసిన ఈడీ పూరి బ్యాంకు లావాదేవీలపై కూడా ప్రశ్నల వర్షం కురిపించింది. పూరి మరోసారి విచారణకి పిలిచే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది.
అంతేకాకుండా పూరి ఆడిటర్ ని పూరి ని విడివిడిగా ప్రశ్నించింది ఈడీ . విచారణ పూర్తి కావడంతో ఈడీ కార్యాలయం నుండి బయటికి వచ్చిన పూరి జగన్నాథ్... మీడియాతో మాట్లాడకుండానే తన కొడుకు, ఆడిటర్ తో కలిసి కారులో వెళ్ళిపోయాడు.