టాలీవుడ్ సెలబ్రిటీస్ కి ఈడీ మనీలాండరింగ్ కేసులో నోటీసులు ఇచ్చిన వారిని విచారిస్తుంది. పూరి జగన్నాధ్ దగ్గర నుండి ఛార్మి, రకుల్, రానా లాంటి సెలబ్రిటీస్ కి ఈ మనీ లాండరింగ్ కేసులో నోటీసులు అందుకున్నా సెలబ్రిటీస్ ఈడీ ఇచ్చిన డేట్స్ లో విచారణకు హాజరవడానికి సిద్ధంగా ఉన్నారు. ముందుగా దర్శకుడు పూరి జగన్నాధ్ ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యాడు. నేడు ఈడీ ఆఫీస్ కి కొడుకు ఆకాష్ తో వచ్చిన పూరి ని ఇప్పటికి అంటే రాత్రి అయినా ఈడీ అధికారులు ప్రశ్నిస్తూనే ఉన్నారు. అయితే ఇప్పడు పూరి కేసులో బండ్ల గణేష్ ఇన్వాల్వెమెంట్ ఆసక్తికరంగా మారింది.
పూరి ఈడీ ఆఫీస్ లో విచారణలో ఉండగా బండ్ల గణేష్ ఈడీ ఆఫీస్ దగ్గర ప్రత్యక్షమయ్యాడు. అయితే అధికారులు పూరి జగన్నాధ్ - బండ్ల కాంబోలో తెరకెక్కిన సినిమాల లావాదేవీలు పరిశీలిస్తున్నట్టుగా.. తెలుస్తుంది. ఇద్దరమ్మాయిలతో, టెంపర్ వంటి హిట్ సినిమాలను బండ్ల గణేష్ పూరి దర్శకత్వం లో నిర్మించగా అవి హిట్ అవడంతో.. ఇప్పడు ఆ లావాదేవీల విషయంలోనూ పూరి ని అధికారులు ప్రశినిస్తున్నారట. దాని కోసం బండ్ల గణేష్ ని కూడా విచారణకు పిలిపించారని తెలుస్తుంది.
అయితే పూరి కోసమే తాను ఈడీ ఆఫీస్ కి వచ్చాను అని, తనకి ఈ డ్రగ్స్ కేసుకి సంబంధం లేదని.. అసలు తనకి డ్రగ్స్ తీసుకునే అలవాటు లేదని, తనకి ఒక్కపొడి నమిలే అలవాటు కూడా లేదంటూ బండ్ల మీడియాకి సమాధానం ఇచ్చాడు.