గత వారం రోజులుగా టాలీవుడ్ సెలబ్రిటీస్ కనిమీద కునుకు లేకుండా చేస్తుంది ఈడీ నోటీసులు. 12 మంది సెలబ్రిటీస్ కి ఈడీ నోటీసులు ఇచ్చి తాము చెప్పిన తేదీల్లో విచారణకు హాజారు కావాలంటూ చెప్పడంతో.. తమకి ఇచ్చిన డేట్స్ ప్రకారం సెలబ్రిటీస్ ఈడీ ముందు విచారణకి హాజరవడానికి రెడీ అయ్యారు. ముందుగా నేడు పూరి జగన్నాధ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. నేడు పూరి జగన్నాధ్ తన కొడుకు ఆకాష్ పూరి తో కలిసి ఈడీ ఆఫీస్ కి వచ్చాడు.
అయితే విచారణకు హాజరయిన పూరి జగన్నాధ్ తో మీడియా మాట్లాడేందుకు ప్రయత్నించినా పూరి మాత్రం మీడియా ని తప్పించుకుని ఈడీ ఆఫీస్ లోకి వెళ్ళిపోయాడు. అయితే డ్రగ్స్ కేసులో బయటికి వచ్చిన పేర్లు.. ఇప్పుడు మనీ లాండరింగ్ కేసులో హైలెట్ అవడంతో.. ఈడీ నోటీసులు ఇచ్చిన సెలబ్రిటీస్ ని ఎలాంటి ప్రశ్నలు వేస్తుందో.. ఎంతసేపు విచారిస్తుందో అనే దాని మీద అందరిలో ఆశక్తి మొదలైంది.
పూరి తో పాటుగా మరికొందరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు గా ఆధారాలు ఉన్న నేపథ్యంలో.. వాటిని ఏ రూపంలో కొనుగోలు చేశారు అన్న కోణంలో విచారణ జరగనుందని అంటున్నారు. ఇక ఈ ఈడీ విచారణ మొత్తం ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ గోయల్ నేతృత్వంలో జరగనుంది. పూరి తో పాటుగా ఆయన కొడుకు, పూరి చార్టెడ్ అకౌంటెంట్ లు కూడా ఉన్నారు.