Advertisement
Google Ads BL

శిల్పా శెట్టి కఠిన నిర్ణయం


బాలీవుడ్ నటి శిల్పా శెట్టి ఈ మధ్యన భర్త రాజ్ కుంద్రా అరెస్ట్ తో పరువు తో పాటు ఆర్ధికంగానూ చాలా నష్ట పోయింది. రాజ్ కుంద్రా అస్లీల చిత్రాల కేసులో జైలుకి వెళ్లడంతో.. శిల్పా శెట్టి మానసికంగానూ, ఆర్ధికంగానూ కుంగిపోయింది. శిల్పా శెట్టిని కూడా అందరూ అనుమానంగా చూడడం, మీడియాలో శిల్పా శెట్టిపై కథనాలు రావడంతో బాగా ఇబ్బంది పడిన శిల్పా శెట్టి.. తాను చేస్తున్న బుల్లితెర షోస్ నుండి కూడా నిష్క్రమించింది. అయితే మళ్ళీ కోలుకుని తాను జెడ్జి గా వెళుతున్న సూపర్ డాన్సర్ 4 లో పాల్గొంది. తప్పులు అందరూ చేస్తారు కానీ ఆ తప్పులు భయంకరంగా, ఇతరులను బాధించేలా ఉండకూడదు అంటూ మళ్ళీ బయట ప్రపంచంలోకి అడుగుపెట్టింది.

Advertisement
CJ Advs

అయితే తాజాగా శిల్పా శెట్టి కఠిన నిర్ణయం తీసుకున్నట్లుగా బి టౌన్ వర్గాల టాక్. జులై లో పోలీస్ కష్టడికి వెళ్లిన రాజ్ కుంద్రా రీసెంట్ గానే బెయిల్ పై బయటికి వచ్చాడు. అయితే భర్త కేసుతో పరువు పోగొట్టుకున్న శిల్పా శెట్టి భర్త నుండి దూరంగా ఉండాలని అనుకుంటుందట. అంటే భర్త రాజ్ కుంద్రాకి విడాకులు ఇవ్వాలని శిల్పా శెట్టి అనుకుంటున్నట్లుగా బి టౌన్ కోడై కూస్తుంది. మరి ఇందులో నిజానిజాలేంత అనేది శిల్పా శెట్టి స్పందింస్తేనే కానీ తెలియదు. 

Shilpa Shetty tough decision:

Shilpa Shetty Is Planning A Separate Life From Raj Kundra, Is Divorce On Cards?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs