Advertisement
Google Ads BL

కలర్ ఫుల్ వరుడు కావలెను


నాగ శౌర్య - రీతూ వర్మ జంటగా సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై లక్ష్మి సౌజన్య తెరకెక్కిస్తున్న వరుడు కావలెను టీజర్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఎన్ని సంబంధాలు వచ్చినా పేర్లు పెడుతూ.. వాల్లెవరు నాకు కనెక్ట్ అవవడం లేదే అంటూ చెడగొట్టుకునే హీరోయిన్ రీతూ వర్మకి ఎలాగైనా పెళ్లి చేసి పంపించాలనే ఆశయంతో తిరుగుతుంది తల్లి నదియా. అప్పుడే ముప్పై ఏళ్ళు వచ్చేసాయి అంటూ చెప్పినా కూతురు పెట్టే కండిషన్స్ కి పెళ్లి కొడుకులు పారిపోతారు. అప్పుడు హీరో నాగ శౌర్య ఎంట్రీ ఇస్తాడు. రీతూ వర్మని చూసి ఇష్టపడతాడు. 

Advertisement
CJ Advs

రీతూ వర్మ ని ఆ అందం ఆ పొగరు ఆర్డర్ ఇచ్చి చేయించినట్టుగా ఉంటుంది అంటూ పొగిడేస్తాడు. నాగ శౌర్య చాకలేట్ ఇస్తే.. ఫ్లట్టింగ్ లో ఏమైనా కోర్సు చేసావా.. వచ్చిన పని చూసుకుని వెళ్ళు అంటుంది. ఇక నాగ శౌర్య లుక్స్, రీతూ వర్మ లుక్స్ అని చాలా కలర్ ఫుల్ గా ఉన్నాయి. స్టైలిష్ నాగ  శౌర్య కి పొగరు పట్టిన అమ్మాయి, ఈగో ఉన్న అమ్మాయి రీతూ వర్మ తగిల్తే ఎలా ఉంటుందో వరుడు కావలెను టీజర్ లో చూపించేసారు. ప్రతి బాల్ సిక్స్ కొట్టే బాట్స్‌మెన్ ని చూశావా… మా వాడు కొడ‌తాడు ప్ర‌తీ బాలూ నోబాల్ ఇచ్చే ఎంపైర్ ని చూశావా… ఆవిడ ఇస్తుంది.. అంటూ వెన్నెల కిషోర్ మరో కమెడియన్ చెప్పే డైలాగ్ సూపర్ అనేలా ఉంది. ఇంకా మ్యూజిక్, బ్యాగ్ రౌండ్ స్కోర్, వెన్నెల కిషోర్ పంచెస్ అన్ని హైలెట్ అనేలా కాదు.. కలర్ ఫుల్ గా ఉన్నాయి. 

Naga Shourya Varudu Kaavalenu teaser out:

Naga Shourya - Ritu Varma Varudu Kaavalenu teaser out
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs