Advertisement
Google Ads BL

యాక్షన్‌ చేయడం ఇష్టం: సమంత


ఎప్పుడూ క్యూట్ అండ్ గ్లామర్ లుక్స్ తో, గ్లామర్ కేరెక్టర్స్ అదరగొట్టేసే సమంత పెళ్లి తర్వాత పెరఫార్మెన్స్ ఓరియెంటెడ్ మూవీస్ లో నటిస్తూ దూసుకుపోతుంది. మొన్నటికి మొన్న రాజి కేరెక్టర్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 లో యాక్షన్ లోను అదరగోట్టేసిన సమంత కి ఆ రాజి పాత్రకి అవార్డు కూడా వచ్చింది. తాజాగా సమంత మాట్లాడుతూ తనకి యాక్షన్‌ చిత్రాలూ చేయాలని అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది అని.. రాజీ పాత్ర కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలు కూడా చేశాను అని చెబుతుంది. 

Advertisement
CJ Advs

ఒక సినిమాలో విలన్లు హీరోయిన్‌ని బంధిస్తే ఎవరైనా ఉన్నారా.. నన్ను రక్షించండి.. అనే పాత్ర కాకుండా.. ఫ్యామిలీ మ్యాన్ 2 లో నేనే యాక్షన్‌ చేయడం మంచి అనుభూతి పంచింది. ఇప్పుడు ఇక నాకు ప్రస్తుతానికి సూపర్‌మ్యాన్‌గా నటించాలనుంది. అలాగే రాజకుమారి పాత్రలన్నా చాల ఇష్టం. ఆ కోరిక కూడా గుణశేఖర్ శాకుంతలం మూవీతో తీరిపోయింది అంటూ చెప్పుకొచ్చింది సమంత. డిస్నీ, యానిమేటెడ్‌ పాత్రలను చూస్తూ ఇన్స్పైర్ అవుతుంటాను అని, ఇక రాజ్ అండ్ డీకే లు రాజి పాత్రకి నన్ను ఎంపిక చెయ్యడం సాహసమనే చెప్పాలి. 

నిజం చెబుతున్నా.. ఫ్యామిలీ మ్యాన్ 2 లో రాజి పాత్రను నేనే చూడలేకపోయాను. ఇక నేను సోషల్ మీడియాలో పేరు మార్చుకున్నప్పుడు నాకు కొన్నివేల మెస్సేజ్ లు వచ్చాయి. కానీ నాకు ఇష్టమైనప్పుడు మాత్రమే వాటి గురించి నేను సమాధానం చెబుతాను అంటూ చెప్పుకొచ్చింది సమంత. 

Likes doing action‌ says Samantha:

Disney fan Samantha Akkineni reveals she takes acting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs