ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అవడంతో రామ్ చరణ్ కొద్దిగా ఫ్రీ అయ్యారు. రామ్ చరణ్ ఆర్.ఆర్.ఆర్ ప్యాచ్ వర్క్ కంప్లీట్ చేసేసి శంకర్ తో పాన్ ఇండియా మూవీ కోసం రెడీ అవుతారు. ఇక రామ్ చరణ్ తన ఇంట్లో పివి సింధు కి జరిగిన సత్కారంలో హైలెట్ అవ్వగా.. చిరు బర్త్ డే వేడుకల్లోనూ రామ్ చరణ్ భార్య ఉపాసనతో కలిసి హడవిడి చేసాడు. అయితే అదే రోజు తన సిస్టర్స్ అంతా చరణ్ కి రాఖి కట్టిన ఫొటోస్ వైరల్ అయ్యాయి. అప్పుడు చెల్లెళ్లకి పార్టీ ఇవ్వని రామ్ చరణ్ నేడు మెగా సిస్టర్స్ తో కలిసి లంచ్ చేసాడు.
రామ్ చరణ్ తో నిహారిక, చరణ్ అక్క సుష్మిత, చెల్లెలు శ్రీజ తో కలిసి లంచ్ కి వెళ్లిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నిహారిక అన్న చరణ్ తో కలిసి అక్కలతో కలిసి ఉన్న పిక్స్ ని పోస్ట్ చేసింది. ఇక చరణ్ తన సిస్టర్స్ తో ఉన్న పిక్స్ ని షేర్ చేస్తూ వీకెండ్ లంచ్, రాఖి సెలెబ్రేషన్స్ అంటూ పోస్ట్ చెయ్యడంతో అభిమానులు వాటిని తెగ షేర్ చేస్తూ హడావిడి చేస్తున్నారు.