ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ ని ఫినిష్ చేసి ఎవరు మీలో కోటీశ్వరులు షో కి హాజరవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అక్టోబర్ నుండి తన తదుపరి చిత్రాన్ని కూడా మొదలు పెట్టాలనే ప్లాన్ లో ఉన్నాడు. ఆర్.ఆర్.ఆర్, ఎవరు మీలో కోటీశ్వరులు షోస్ ని త్వరత్వరగా ఫినిష్ చేసి ఎన్టీఆర్ ఫ్రీ అయినా కొరటాల ఆచార్య షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులని ఫినిష్ చేసుకుని రావాలి. అయితే ఎన్టీఆర్ - కొరటాల కాంబో NTR30 కి మ్యూజిక్ డైరెక్టర్ గా ఆల్మోస్ట్ తమిళ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ ఫిక్స్ అయినట్లుగా టాక్ ఉంది.
అయితే అనిరుద్ ఇప్పటికే కొరటాల - ఎన్టీఆర్ కాంబో ఎన్టీఆర్30 కి మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టేసినట్లుగా తెలుస్తుంది. త్వరలోనే అనిరుద్ రవిచంద్రన్ ని అఫీషియల్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా అనౌన్స్ చేస్తారని, అలాగే హీరోయిన్ గా కియారా అద్వానీ కానీ, అలియా భట్ కానీ NTR30 ఫైనల్ చేసే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది.