నాగ చైతన్య - సమంత డివోర్స్ తీసుకోబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో తెగ హైలెట్ అయ్యింది. గత కొన్ని రోజులుగా సమంత కి నాగ చైతన్య కి మధ్యన విభేదాలు తలెత్తేయని అందుకే వారు ఇద్దరూ డైవర్స్ కి అప్లై చేసారంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అందుకే సమంత తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో సమంత అక్కినేని అని తీసేసి.. సమంత రౌత్ ప్రభు, S అంటూ పెట్టుకుంది, అలాగే నటనలోనూ బ్రేక్ తీసుకోవాలని అనుకుంటుంది, వ్యక్తిగత సమస్యల్తో సమంత సఫర్ అవుతుంది అంటూ ప్రచారం మొదలైంది. అయితే నాగార్జున బర్త్ డే ముందు ఇలాంటి న్యూస్ బయటికి రావడం అక్కినేని ఫాన్స్ ని కలచివేసింది. ఈ విషయమై ఆరాలు కూడా మొదలయ్యాయి.
అయితే తాజాగా సమంత - నాగ చైతన్య మధ్యలో ఎలాంటి విభేదాలు లేవని, వారు సఖ్యంగానే ఉన్నారని, వారి విడాకుల మేటర్ కేవలం రూమర్ అని, ఇలాంటి ఫేక్ న్యూస్ లపై ఎవరు వివరణ ఇవ్వక్కర్లేదు అంటూ అక్కినేని కాంపౌండ్ నుండి వినిపిస్తున్న న్యూస్. ఇక సోషల్ మీడియాలో సమంత అక్కినేని నుండి S గా మారడం వెనుక, సమంత నటిస్తున్న పాన్ ఇండియా ఫిలిం శాకుంతలం ప్రమోషన్స్ లాజిక్ ఉందని అంటున్నారు. సో సమంత - అక్కినేని నాగ చైతన్య విడాకుల న్యూస్ జస్ట్ ఫేక్ అన్నమాట.