ఈ ఏడాది చెక్, రంగ్ దే మూవీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. మళ్ళీ మాస్ట్రో తో ప్రేక్షకులని అలరించడానికి వచ్చేస్తున్నాడు. బ్లాక్ కామెడీ క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో రూపొందుతున్న నితిన్ సినిమా మ్యాస్ట్రో చిత్రం డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే సంగతి తెలిసిందే. ప్రముఖ డిజిటల్ సంస్థ డిస్నీ హాట్ స్టార్‌లో సెప్టెంబర్ 17న మాస్ట్రో’ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు డిస్నీహాట్ స్టార్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. హీరో నితిన్ ల్యాండ్ మార్క్‌గా నటిస్తోన్న 30వ చిత్రమిది.
మ్యాస్ట్రో స్ట్రీమింగ్ డేట్‌ను తెలియజేస్తూ విడుదల చేసిన పోస్టర్‌లో హీరో నితిన్ నల్లటి కళ్లద్దాలు ధరించి చేతిలో కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఇక సినిమాలో నటిస్తోన్న ప్రధాన తారాగణమైన నభా నటేశ్, తమన్నా భాటియా, వి.కె.నరేశ్, జిస్సుసేన్ గుప్తా, తదితరులు పోస్టర్‌లో కనిపిస్తున్నారు.