Advertisement
Google Ads BL

టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కీలక మలుపు


మూడేళ్ళ క్రితం టాలీవుడ్ ని డ్రగ్స్ కేసు తర్వాత నీరు కారిపోయింది అనుకుంటే.. మళ్ళీ తాజాగా డ్రగ్స్ కేసు కాస్తా మనీలాండరింగ్ కేసుగా మలుపు తీసుకుంది. టాలీవుడ్ టాప్ సెలబ్రిటీస్ అయిన 12 మందికి ఈడీ నోటీసు లు జారీ చెయ్యడం మరోసారి కలకలం రేపింది. ఈడీ సెలబ్రిటీస్ కి నోటీసు లు జారీ చెయ్యడమే కాదు.. వాళ్ళని విచారించడానికి తేదీ లని ఫిక్స్ చేసేసింది. రకుల్, రానా, రవితేజ, పూరి, ఛార్మి, తరుణ్, నవదీప్, నందు, తనీష్ మరికొంతమందిని ఈడీ విచారించడానికి రెడీ అవుతుంది. అయితే ఈడీ ఈ డ్రగ్స్ కేసులో మరింత దూకుడు ప్రదర్శిస్తుంది. 

Advertisement
CJ Advs

ఈ కేసులో ఈడీ ఇంటర్ పోల్ సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. హవాలా మార్గంలో డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఈడీ దగ్గర కీలక ఆధారాలున్నట్లు తెలుస్తోంది. అసలు సెలబ్రిటీస్  విదేశాలకు నిధుల తరలింపుపై ఈడీ విచారిస్తోంది. ఈ కేసులో డ్రగ్ పెడ్లర్స్ కెల్విన్, కమింగా, విక్టర్‌ల వాగ్మూలాన్ని సేకరించిన ఈడీ ఇప్పుడు విదేశీ బ్యాంక్స్ లోకి సెలబ్రిటీస్ డబ్బు ని ఎంత తరలించారో.. తెలుసుకోవడానికి ఇంటర్ పోల్ సహాయం తీసుకోనుంది. ఈ కేసుకలో ఈ 12 మంది సెలబ్రిటీస్ కాకుండా మరికొంతమంది సెలబ్రిటీస్ కి ఈడీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. 

A turning point in the Tollywood drugs case:

Tollywood drugs case: ED consults Excise officials
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs