Advertisement
Google Ads BL

అఖిల్ కూడా కన్ ఫమ్ అంటున్నాడు


సెకండ్ వెవ్ ముగిసాక యంగ్ హీరోలు తమ సినిమాల రిలీజ్ డేట్స్ ప్రకటిస్తూ సందడి చేస్తున్నారు. లవ్ స్టోరీ సెప్టెంబర్ 10 న థియేటర్స్ లో రిలీజ్ చేస్తుంటే.. నాని టక్ జగదీశ్ అదే రోజున ఓటిటి నుండి రిలీజ్ అవుతుంది. అలాగే యంగ్ హీరో నితిన్ మ్యాస్ట్రో కూడా ఓటిటి నుండి రిలీజ్ కాబోతుంది. ఇక ఈ నెల మొత్తం థియేటర్స్ లో బోలెడన్ని సినిమాలు సందడి చేసాయి. అయితే ఎప్పుడో జులైలో విడుదల కావల్సిన అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సందడి కనిపించలేదు. అఖిల్ సినిమా ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో అనే అనుమానాలు సోషల్ మీడియాలో బయలుదేరాయి. 

Advertisement
CJ Advs

దానితో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ మేకర్స్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ సినిమా అక్టోబర్ 8 న థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది అంటూ పోస్టర్ తో పాటుగా ప్రకటించారు. అఖిల్ - పూజ హెగ్డే కలయికలో బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో గీత ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్సమెంట్ వచ్చేసింది. సో అఖిల్ కూడా అక్టోబర్ 8 న లవర్ బాయ్ గా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 

Akhil Most Eligible Bachelor announces its release:

Akhil - Pooja Hegde Most Eligible Bachelor announces its release
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs