Advertisement
Google Ads BL

అవన్నీ పట్టించుకుంటే కష్టం అంటుంది


తెలుగులో క్రేజీ గా స్టార్ హీరోలతో నటించి తర్వాత బాలీవుడ్ కి చెక్కేసి అక్కడ టాప్ హీరోయిన్ గా మారిన తర్వాత మరోసారి స్టార్ హీరో సినిమాతో పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగుపెడుతున్న కియారా అద్వానీ సోషల్ మీడియా క్వీన్. ఈమధ్యన గ్లామర్ డ్రెస్సులతో తెగ హైలెట్ అవుతున్న కియారా అద్వానీ రామ్ చరణ్ తో కలిసి దర్శకుడు శంకర్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీలో నటిస్తుంది. అయితే కియారా అద్వానీ నటించిన షేర్షా హిట్ అవడంతో కియారా చాలా హ్యాపీ గా ఉంది. అయితే సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే కియారపై నెటిజెన్స్ కూడా అప్పుడప్పుడు నెగెటివ్ గా స్పందించడం చూస్తుంటాము. 

Advertisement
CJ Advs

అయితే తాజాగా కియారా తనపై  కామెంట్స్ గురించి మట్లాడుతూ.. తాను అలాంటి నెగెటివ్ కామెంట్స్ గురించి పట్టించుకోనని, రోజు పొద్దునే అలాంటి నెగెటివ్ కామెంట్స్ చూస్తూ రోజుని ప్రారంభించడం తనకి నచ్చదని, అందుకే వాటిని పట్టించుకోను. కానీ నా పేరెంట్స్ ఆ నెగెటివ్ కామెంట్స్ ని చదువుతారు. నేను వాళ్ళని ఎందుకు చదువుతారు అని అడగను. 

వాళ్ళకి నా పై ఎలాంటి కామెంట్స్ వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆత్రుత. ఎందుకు అమ్మ అవి చదివి మనసు పాడు చేసుకుంటారు అని అడిగితే.. నీ గురించి ఏం రాస్తున్నారో నాకు తెలుసుకోవాలని ఉంటుంది అని అమ్మ చెప్పడంతో.. సరే వాళ్ళిష్టం అని వేదిలేసాను. కానీ నెటిజెన్స్ ఒక్కటి చెప్పదలచుకున్నాను. అందరిలాగే సెలబ్రిటీలకు పర్సనల్ లైఫ్ ఉంటుంది. వాళ్ళకి ఎమోషన్స్, బంధాలు ఉంటాయి. వాటిని గౌరవించడం అందరికి నైతిక ధర్మం అంటూ చెప్పుకొచ్చింది. 

Kiara Advani reaction to netizen:

A social media user called Kiara Advani dumb but instead of hitting back she reacted in the most graceful manner
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs