Advertisement
Google Ads BL

ఫాన్స్ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ: మెగా బ్రదర్స్


మెగాస్టార్ చిరంజీవి పుట్టిన‌రోజు ఆగ‌స్టు 22న జ‌రిగింది. ఈ వేడుక‌ల్లో ఆయ‌న‌కు విషెస్ తెలిపేందుకు తిరుప‌తి అలిపిరి నుంచి ఒక వీరాభిమాని సైకిల్ యాత్ర చేప‌ట్టి 12రోజులు ప్ర‌యాణించ‌డం ఆశ్చ‌ర్య‌పరిచింది. ఈ సంద‌ర్భంగా చిరంజీవి త‌న‌ను క‌లిసేందుకు అభిమానికి అంత శ‌క్తి ఎలా వ‌చ్చిందో అంటూ ఆశ్చ‌ర్య‌పోయారు. ఈ సాహ‌సం స‌రికాద‌ని వారించారు.

Advertisement
CJ Advs

మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ- నా అభిమాని ఎన్. ఈశ్వ‌ర‌య్యా బ‌లుజుప‌ల్లి గ్రామం నుంచి వ‌చ్చాడు. తిరుప‌తి (అలిపిరి) నుంచి అత‌డు సైకిల్ పై ప్ర‌యాణం ప్రారంభించాడు. నా పుట్టిన‌రోజు కోసం అత‌డు సైకిల్ యాత్రను చేప‌ట్టి వ‌చ్చి క‌లిసాడు. నా ఆరాధ్య దైవం ఆంజ‌నేయ స్వామి మాల‌ను ధ‌రించి స్వామి ఆశీస్సులు మాకు ఉండాల‌ని కోరుకున్నారు. మేం ఆయురారోగ్యాల‌తో ఉండాల‌ని ఆలోచిస్తూ వ‌చ్చారు. ఆగ‌స్టు 10న‌ బ‌య‌ల్దేరి 12 రోజుల పాటు సైకిల్ యాత్ర చేసుకుంటూ అలిపిరి నుంచి వ‌చ్చాడు ఈ అభిమాని. చాలా సంద‌ర్భాల్లో చెప్పాను.  మాకు అభిమానుల ప్రేమ ఆద‌ర‌ణ గొప్ప ఎన‌ర్జీ. ఇలాంటి అభిమానుల మంచి మ‌న‌సు ఆశీస్సులతోనే మేం బావుంటాం. వారు మా గురించి ఆలోచించిన‌ట్టే మేం కూడా వారు వారి కుటుంబ స‌భ్యులు బావుండాల‌ని కోరుకుంటూ బెస్ట్ విషెస్ తెలియ‌జేస్తున్నాను అని అన్నారు. అలాగే త‌మ్ముడు ప‌వ‌న్ క‌ల్యాణ్ ని క‌ల‌వాల‌ని అడిగిన ఆ అభిమానికి క‌లిసేందుకు అవ‌స‌ర‌మైన ఏర్పాట్లు చేశారు మెగాస్టార్ చిరంజీవి.

వెంటనే ఆ వీరాభిమాని పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని కలవటం జరిగింది ఇక తన ఆనందానికి అవధులు లేదనే చెప్పాలి. తన జన్మ ధన్యమైంది అంటూ.. పన్నెండు రోజుల సైకిల్ ప్రయాణాన్ని వీరిని కలిసిన ఒకరోజులో మర్చిపోయేలా చేసారు మెగాస్టార్ చిరంజీవిగారు, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు అంటున్నాడు ఆ వీరాభిమాని.

Fans Energy.. Great Energy: Mega Brothers:

 We have the greatest energy of fan love: Megastar Chiranjeevi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs