Advertisement
Google Ads BL

అభిమాని ని మోసం చేసిన ఎన్టీఆర్


ఆర్.ఆర్.ఆర్ హీరో ఎన్టీఆర్ బుల్లితెర మీద చేస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో గత రాత్రి మాంచి రసవత్తరంగా సాగింది. ఆర్.ఆర్.ఆర్ హీరో రామ్ చరణ్ ఓపెనింగ్ ఎపిసోడ్ తోనే షో పై అందరిలో ఆసక్తిని క్రియేట్ చేసిన నిర్వాహకులు రోజు అదే క్యూరియాసిటీతో షో ని నడుపుతున్నారు. ఇక సోమవారం నుండి గురువారం వరకు సాగే ఈ షో గత రాత్రి మంచి ఇంట్రెస్ట్ తో సాగింది. ఎన్టీఆర్ కి వీరాభిమాని అయిన అనురాధ చాలా చక్కగా ఈ గేమ్ ఆడింది. ఎన్టీఆర్ అడుగుతున్న ప్రశ్నలకు తెలివిగా సమాధానాలు చెబుతూ.. లైఫ్ లైన్స్ వాడుతూ ఈ షో నుండి 12,50000 గెలుచుకుంది. 

Advertisement
CJ Advs

అయితే మూడున్నరలక్షల ప్రశ్న అప్పుడు అనురాధ ఎన్టీఆర్ తో డాన్స్ చేయాలని ఉంది అని అడగగా.. దానికి ఎన్టీఆర్ కూడా 12,50000 ప్రశ్నకి సమాధానము చెబితే డాన్స్ చేసే అవకాశం ఉంది అని చెప్పడంతో అనురాధ హుషారు అయ్యింది. అయితే అనురాధ 12,50000 లక్షల ప్రశ్నకి సమాధానము చెప్పినా ఎన్టీఆర్ ఆమెతో డాన్స్ చెయ్యకుండా మోసం చేసాడు. అంటే ఇక్కడ కోవిడ్ ప్రోటో కాల్స్ నడుస్తున్నాయి. కరోనా టైం లో కనీసం ఎన్టీఆర్ చేతితో చెక్ అందుకునే అవకాశం కూడా కంటెస్టెంట్స్ కి లేదు. సో అలా అనురాధ కి ఇచ్చిన మాటని ఎన్టీఆర్ కరోనా కారణముగా నిలబెట్టుకోలేకపోయాడు. 

ఇక ఎన్టీఆర్ లైఫ్ లో మీరు ఎవరికీ థాంక్స్ చెప్పుకుంటారని అనురాదని అడిగితె దానికి ఎన్టీఆర్ అభిమాని అయిన అనురాధ నా బలం ఏమిటో మీకు తెలుసు. డెఫినెట్‌గా మీకే థ్యాంక్స్ చెప్పుకొంటాను అంటూ అనడంతో ఎన్టీఆర్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నాపై వెలకట్టలేని ప్రేమను పెంచుకొన్న మీలాంటి అభిమానులకు శిరసు వంచి నమస్కారం చేస్తున్నాను అంటూ ఆమెకి వీడ్కోలు చెప్పాడు. 

NTR who cheated the fan:

Watch: NTR as Evaru Meelo Koteeswarulu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs