రాజమౌళి - రామారావు - రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న ఆర్.ఆర్.ఆర్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయినట్లుగా మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అప్ డేట్ ఇచ్చారు. Team #RRRMovie has wrapped up the entire shoot except a couple of pickup shots.
The post production work is moving at a brisk pace. More updates coming soon. @ssrajamouli @tarak9999 @AlwaysRamCharan @RRRMovie @DVVMovies షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యింది.. జస్ట్ పికప్ షాట్స్ తప్ప. మరోపక్క పోస్ట్ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడుగా జరుగుతున్నాయి. మరిన్ని అప్ డేట్స్ త్వరలోనే.. అంటూ ఆర్.ఆర్.ఆర్ మేకర్స్ అప్ డేట్ ఇవ్వడంతో స్టార్ హీరోల ఫాన్స్ సోషల్ మీడియాలో హడావిడి మొదలు పెట్టేసారు.
మరి ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ కావడంతో ఆర్.ఆర్.ఆర్ హీరోలు తమ తదుపరి సినిమాల కోసం రెడీ అవుతున్నారు. ఎన్టీఆర్ కొరటాలతో చెయ్యబోయే పాన్ ఇండియా ఫిలిం తో పాటుగా, జెమిని ఛానల్ లో ఎవరు మీలో కోటీశ్వరులు షో కి అటెండ్ అవుతున్నాడు. మరోపక్క రామ్ చరణ్ కూడా శంకర్ తో చెయ్యబోయే మూవీ కోసం రెడీ గా ఉన్నాడు. ఇక ఆర్.ఆర్.ఆర్ షూటింగ్ కంప్లీట్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ తో పాటుగా ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్స్ ని రాజమౌళి చకచకా పూర్తి చెయ్యాలని ఫిక్స్ అయ్యాడని తెలుస్తుంది.