Advertisement
Google Ads BL

ట్విట్టర్ లో S పేరుపై సమంత క్లారిటీ


సమంత రౌత్ ప్రభు నుండి అక్కినేని కోడలిగా మారిన తర్వాత సమంత తన సర్ నేమ్ ని సమంత అక్కినేని గా మార్చుకుంది. చైతు తో పెళ్లి తర్వాత సమంత తన సోషల్ మీడియాలో తన ప్రొఫైల్ ని సమంత అక్కినేని గా మార్చుకుంది. ట్విట్టర్ ద్గగర నుండి పేస్ బుక్ వరకు పేరుని మార్చుకున్న సమంత.. ఈమధ్యన ట్విట్టర్ హ్యాండిల్ నుండి సమంత అక్కినేని పేరుని తీసేసి కేవలం S ఉంచి.. దాని కింద కేవలం సమంత రౌత్ ప్రభు అని పెట్టడంపై అందరిలో అనుమానాలు, సోషల్ మీడియా లో సమంత సర్ నేమ్ మార్చడంపై కారణమేమిటో అనే ఊహాగానాలు బయలుదేరాయి. 

Advertisement
CJ Advs

అయితే అప్పటి నుండి సమంత తన పేరు మార్పు విషయం పై స్పందించలేదు. తాజాగా ప్రొఫైల్ నేమ్ ను S గా మార్చడంపై సమంత అటు ఇటు కానీ క్లారిటీ ఇచ్చింది. తన చుట్టూ ఉన్న కాంట్రవర్సీలపై ఎప్పుడుపడితే అప్పుడు స్పందించలేనని, తనకి నచ్చిఅంప్పుడు, తనకు ఇష్టం వచ్చినప్పుడే ఆ కాంట్రవర్సీలపై మాట్లాడతానని చెప్పిన సమంత.. .పర్సనల్ విషయాల గురించి మాట్లాడటం తనకు పెద్దగా ఇష్టం ఉండదని చెప్పింది. అన్నట్టు సమంత ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సీరీస్ ఇప్పుడు తెలుగులోను అందుబాటులోకి వచ్చింది. అమెజాన్ ప్రైమ్ లో ఫ్యామిలీ మ్యాన్ 2 తెలుగు స్ట్రీమింగ్ రెండు రోజుల క్రితమే అందుబాటులోకి వచ్చింది. 

Samantha Clarity on the S name on Twitter:

Samantha drops Akkineni from Twitter and Insta handles 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs